బావిలో పడిన ట్రాక్టర్‌

ABN , First Publish Date - 2021-02-06T06:57:10+05:30 IST

ట్రాక్టర్‌ అదుపుతప్పి బావిలో పడిన సంఘటన ఏర్పేడు మండలంలో జరిగింది.

బావిలో పడిన ట్రాక్టర్‌
బావిలో పడిన ట్రాక్టర్‌

ఏర్పేడు, ఫిబ్రవరి 5: వేగంగా వస్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి బావిలో పడింది. డ్రైవర్‌ అప్రమత్తతో ప్రమాదం నుంచి బయటపడాడు. వివరాలివీ.. ఏర్పేడు మండలం రాజులకండ్రిగకు చెందిన సోమశేఖర్‌ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నారు. గురువారం రాత్రి ఆయన ఇసుక లోడుతో మోదుగులపాళెం నుంచి పాపానాయుడుపేటకు బయలుదేరారు. రాజులకండ్రిగ వద్దకు రాగానే వేగంగా వెళ్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనున్న బావిలో పడింది. అప్రమత్తమైన సోమశేఖర్‌ కిందికి దూకేయడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కాగా, శుక్రవారం మఽధ్యాహ్నానికి క్రేన్‌ సాయంతో ట్రాక్టర్‌ను బావి నుంచి వెలికి తీయాల్సి వచ్చింది. 

Updated Date - 2021-02-06T06:57:10+05:30 IST