పరారీలో చీటీల వ్యాపారి

ABN , First Publish Date - 2021-12-26T05:42:16+05:30 IST

పుత్తూరు మండలం గొల్లపల్లెలో చీటీల వ్యాపారి పరారవడంతో పలువురు ఆందోళన చెందుతున్నారు.

పరారీలో చీటీల వ్యాపారి
రోజాతో మొరపెట్టుకుంటున్న బాధితులు

పుత్తూరు, డిసెంబరు 25 : పుత్తూరు మండలం గొల్లపల్లెలో చీటీల వ్యాపారి పరారవడంతో పలువురు ఆందోళన చెందుతున్నారు.పలు చీటీలను నిర్వహించడంతో పాటు వడ్డీ వ్యాపారం కూడా చేస్తున్న మధు అనే వ్యక్తి ఫొటో స్టూడియోను నడిపేవాడు.పది రోజుల కిందట శ్రీకాళహస్తికి కుటుంబ సభ్యులతో వెళ్లిన మధు తిరిగి రాకపోవడంతో ఆయన పరారయ్యాడని అనుమానిస్తున్నారు.దాదాపు రూ.రెండు కోట్ల దాకా తమకు మధు ఇవ్వాల్సి వుందంటూ రెండు రోజుల కిందట ఎమ్మెల్యే రోజాకు బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి  బాధితులకు న్యాయం చేయాలని పోలీసులను ఆమె ఆదేశించారు. అయితే ఇప్పటి వరకు బాధితుల తరపున పోలీసులకు ఫిర్యాదు అందలేదు.

Updated Date - 2021-12-26T05:42:16+05:30 IST