తృటిలో తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2021-11-23T06:34:49+05:30 IST

ప్రమాదవశాత్తు ఓ విద్యార్థిని విద్యుదాఘాతానికి గురవడంతో, అధ్యాపకులు ఆస్పత్రికి తరలించగా ప్రాణాపాయం నుంచి బయటపడింది.

తృటిలో తప్పిన ప్రమాదం

శ్రీకాళహస్తి, నవంబరు 22: ప్రమాదవశాత్తు ఓ విద్యార్థిని విద్యుదాఘాతానికి గురైంది. సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. వివరాలివీ.. శ్రీకాళహస్తి పట్టణ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని సోమవారం విద్యుదాఘాతానికి గురైంది. విద్యుత్‌ ప్రసారమవుతున్న కళాశాల గోడను తాకడంతో ఈ ప్రమాదం జరిగింది. స్పృహతప్పి పడిపోయిన విద్యార్థిని అఽధ్యాపకులు వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యుల చికిత్సతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

Updated Date - 2021-11-23T06:34:49+05:30 IST