అనుమానాస్పద స్థితిలో కూలీ మృతి

ABN , First Publish Date - 2021-05-31T04:52:28+05:30 IST

రేణిగుంట ఆర్టీసీ బస్టాండులో తమిళనాడు కూలీ అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అనుమానాస్పద స్థితిలో కూలీ మృతి
మృతిచెందిన వినోద్‌

రేణిగుంట, మే 30: స్థానిక ఆర్టీసీ బస్టాండులో ఓ కూలీ అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన వినోద్‌(35) రెండునెలల కిందట రేణిగుంట వచ్చాడు. చిన్నపాటి కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, ఆదివారం తెల్లవారుజామున ఆయన రక్తపుమడుగులో పడిఉండడం స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న సీఐ అంజుయాదవ్‌, ఎస్‌ఐ సునీల్‌ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. మద్యం, గంజాయికి బానిసైన యువకుడు ఎవరితోనైనా గొడవకు దిగడంతో, వారు హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, తిరుపతి విమానాశ్రయం వెళ్లే రామకృష్ణాపురం రోడ్డులో ఓ వృద్ధుడు(70) మృతిచెందాడు. అనారోగ్యంతో చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.  

Updated Date - 2021-05-31T04:52:28+05:30 IST