ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కారు : ఇద్దరు వ్యక్తుల దుర్మణం

ABN , First Publish Date - 2021-11-01T05:19:50+05:30 IST

పుత్తూరు మండలం పరమేశ్వరమంగళం వద్ద కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు.

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కారు : ఇద్దరు వ్యక్తుల దుర్మణం
సంఘటనా స్థలంలోనే మృతి చెందిన గణేష్‌

పుత్తూరు, అక్టోబరు 31 : పుత్తూరు మండలం పరమేశ్వరమంగళం వద్ద కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు.  పరమేశ్వరమంగళం వద్ద వున్న ఫంక్షన్‌ హాల్లో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం ఉదయం నారాయణవనానికి చెందిన మస్తాన్‌(40), గణే్‌ష(60) ద్విచక్రవాహనంపై బయలుదేరారు.  పరమేశ్వరమంగళం వద్ద ఎదురుగా వచ్చిన కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొంది.  ఈ ప్రమాదంలో  ద్విచక్రవాహనంపై వెనుక కూర్చున్న గణేష్‌ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న మస్తాన్‌కు తీవ్రగాయాలు కాగా అతడిని మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మస్తాన్‌ మృతి చెందాడు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పుత్తూరు ఎస్‌ఐ  వెంకటేశ్వర్లు తెలిపారు.Updated Date - 2021-11-01T05:19:50+05:30 IST