వేగంగా వచ్చి.. అదుపు తప్పి

ABN , First Publish Date - 2021-05-30T05:51:41+05:30 IST

వ్యాను అదుపుతప్పడంతో ఒకరు గాయపడిన సంఘటన శనివారం శ్రీకాళహస్తిలో జరిగింది.

వేగంగా వచ్చి.. అదుపు తప్పి
బోల్తాపడిన వాహనం, కిందపడిన మట్టిపాత్రలు

శ్రీకాళహస్తి అర్బన్‌, మే 29: వ్యాను అదుపుతప్పడంతో ఒకరు గాయపడిన సంఘటన శనివారం శ్రీకాళహస్తిలో జరిగింది. వన్‌టౌన్‌ ఎస్‌ఐ మహే్‌షబాబు కథనం మేరకు... శ్రీకాళహస్తి నుంచి తిరుపతికి శనివారం కూరగాయల లోడుతో ఓ వ్యాను బయలుదేరి శ్రీకాళహస్తి హౌసింగ్‌ బోర్డుకాలనీకి వచ్చింది. ఇదే మార్గంలో తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి ద్విచక్రవాహనంలో వెళ్తున్న శ్రీనివాసులు(30) వాహనాన్ని వేగంగా వస్తున్న వ్యాను తప్పించబోయి కుండలు, మట్టిపాత్రలు విక్రయించే మరో వాహనాన్ని ఢీకొంది. ఈ సంఘటనలో శ్రీనివాసులు స్వల్పంగా గాయపడ్డాడు. బాధితుడిని 108 వాహనం సిబ్బంది పట్టణ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2021-05-30T05:51:41+05:30 IST