ఏపీఈఏపీసెట్‌కు 95.63శాతం హాజరు

ABN , First Publish Date - 2021-08-20T07:18:54+05:30 IST

ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ఉమ్మడి ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌కు తొలిరోజైన గురువారం 95.63శాతం విద్యార్థులు హాజరయ్యారు.

ఏపీఈఏపీసెట్‌కు 95.63శాతం హాజరు
తిరుపతిలోని ఎస్వీ కాలేజీలో పరీక్ష రాసి వస్తున్న విద్యార్థులు

తిరుపతి(విద్య), ఆగస్టు 19: ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ఉమ్మడి ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌కు తొలిరోజైన గురువారం 95.63శాతం విద్యార్థులు హాజరయ్యారు. ఎంపిక చేసిన కేంద్రాల్లో కొవిడ్‌ మార్గదర్శకాలు పాటిస్తూ ఉదయం 9-12, మధ్యాహ్నం 3-6గంటల వరకు ఆన్‌లైన్‌లో ఈపరీక్షలను నిర్వహించారు. ఉదయం జరిగిన సెషన్‌లో 1073మందికి 1016మంది, మధ్యాహ్నం 1032కి 996మంది (2104కి 2012 మంది) పరీక్షకు హాజరైనట్లు జేఎన్‌టీయూకే కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రవీంద్ర తెలిపారు. 

Updated Date - 2021-08-20T07:18:54+05:30 IST