సబ్‌కలెక్టరేట్‌ ‘స్పందన’కు 85 అర్జీలు

ABN , First Publish Date - 2021-10-19T05:43:40+05:30 IST

మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన స్పందనకు 85 అర్జీలు వచ్చాయని సబ్‌కలెక్టర్‌ ఎం.జాహ్నవి తెలి పారు.

సబ్‌కలెక్టరేట్‌ ‘స్పందన’కు 85 అర్జీలు
స్పందనలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న సబ్‌కలెక్టర్‌ జాహ్నవి

మదనపల్లె రూరల్‌, అక్టోబరు 18: మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన స్పందనకు 85 అర్జీలు వచ్చాయని సబ్‌కలెక్టర్‌ ఎం.జాహ్నవి తెలి పారు. డివిజన్‌ పరిధిలో  పలురకాల సమ స్యలపై ప్రజలు అర్జీల రూపంలో సబ్‌కలెక్టర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా సబ్‌కలెక్టర్‌ సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికా రులు వారం రోజుల్లో పరిష్కరించాలని, లేని పక్షంలో  ఉన్నతాధికారుల ధృష్టికి తీసుకుపోవా లన్నారు. డీఏవో శేషయ్య, డిప్యూటీ సర్వేయర్‌ మునికణ్ణన్‌, హౌసింగ్‌ ఏఈ వెంకటరెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-19T05:43:40+05:30 IST