పలమనేరులో 60 అడుగుల వైఎస్ విగ్రహావిష్కరణ
ABN , First Publish Date - 2021-09-03T06:22:49+05:30 IST
పలమనేరులో 60 అడుగుల వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు.

పలమనేరు, సెప్టెంబరు 2 :పలమనేరులో 60 అడుగుల వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు.జాతీయరహదారి బైపాస్ రోడ్డుపక్కన శంకర్రాయలపేటకు వెళ్లే జంక్షన్‌లో గంగవరం మాజీ ఎంపీపీ సీవీ కుమార్ తన సొంత స్థలంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.వైఎస్ వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు, తన కుటుంబసభ్యులతో కలిసి సీవీ కుమార్ గురువారం ఉదయాన్నే ఈ విగ్రహాన్ని ప్రారంభించారు.స్థానిక ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరు పట్ల కొంతకాలంగా ఆయన వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.