337 కరోనా కేసులు... నలుగురి మృతి

ABN , First Publish Date - 2021-07-08T07:49:57+05:30 IST

జిల్లాలో మంగళ, బుధవారాల నడుమ 24 గంటల వ్యవధిలో 337 కరోనా పాజిటివ్‌ కేసులను గుర్తించగా అదే వ్యవధిలో కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలోనే అత్యధికంగా నలుగురు మృతి చెందారు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకూ నమోదైన పాజిటివ్‌ కేసులు 222976కు చేరగా కొవిడ్‌ మృతుల సంఖ్య 1646కు పెరిగింది.

337 కరోనా కేసులు... నలుగురి మృతి

తిరుపతి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మంగళ, బుధవారాల నడుమ 24 గంటల వ్యవధిలో 337 కరోనా పాజిటివ్‌ కేసులను గుర్తించగా అదే వ్యవధిలో కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలోనే అత్యధికంగా నలుగురు మృతి చెందారు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకూ నమోదైన పాజిటివ్‌ కేసులు 222976కు చేరగా కొవిడ్‌ మృతుల సంఖ్య 1646కు పెరిగింది. బుధవారం ఉదయానికి జిల్లాలో 4929 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులున్నాయి. కొత్తగా గుర్తించిన పాజిటివ్‌ కేసులు తిరుపతి నగరంలో 24, తిరుపతి రూరల్‌లో 20 వున్నాయి. చిత్తూరులో 18, మదనపల్లెలో 17, పూతలపట్టులో 14, కలికిరిలో 13, రేణిగుంటలో 10, పీలేరులో 9, పుంగనూరు, శ్రీకాళహస్తి, జీడీనెల్లూరు, తవణంపల్లె, ఏర్పేడు, తొట్టంబేడు, చంద్రగిరి, బీఎన్‌ కండ్రిగ, రామచంద్రాపురం మండలాల్లో 8 చొప్పున, పెనుమూరు, బంగారుపాళ్యం, గుడిపాల మండలాల్లో 7 వంతున, వాల్మీకిపురం, కేవీబీపురం మండలాల్లో 6 చొప్పున, ఐరాల, కార్వేటినగరం, పిచ్చాటూరు, వెదురుకుప్పం, నారాయణవనం, కేవీపల్లె మండలాల్లో 5 చొప్పున, ఎర్రావారిపాళ్యం, రొంపిచెర్ల, శ్రీరంగరాజపురం, పాకాల, సదుం, వడమాలపేట, రామసముద్రం మండలాల్లో 4 వంతున, నగరి, పెద్దపంజాణి, శాంతిపురం,యాదమరి, సోమల, చౌడేపల్లె, చిన్నగొట్టిగల్లు, పాలసముద్రం, వరదయ్యపాళ్యం మండలాల్లో 3 చొప్పున, కలకడ, పులిచెర్ల, గుడుపల్లె, సత్యవేడు, గంగవరం, కురబలకోట మండలాల్లో 2 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2021-07-08T07:49:57+05:30 IST