కరోనా బీభత్సం

ABN , First Publish Date - 2021-05-02T07:00:45+05:30 IST

24 గంటల్లో 2768 మంది కరోనా వైరస్‌ బాధితులను చిత్తూరు యంత్రాంగం గుర్తించింది.

కరోనా బీభత్సం

రెండోరోజూ 2700 దాటిన కేసులు 


తిరుపతి, మే 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతునే వుంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం గడచిన 24 గంటల్లో మరో 2768 మంది కరోనా వైరస్‌ బాధితులను యంత్రాంగం గుర్తించింది. అదే వ్యవధిలో వైరస్‌ బారిన పడి ఏడుగురు మరణించారు. తాజా పాజిటివ్‌లతో జిల్లాలో ఇప్పటి వరకూ నమోదైన కరోనా కేసుల మొత్తం సంఖ్య 122152కు చేరుకోగా మరణాల సంఖ్య 983కు చేరింది. మరోవైపు శనివారం ఉదయానికి జిల్లాలో యాక్టివ్‌ పాజిటివ్‌ల సంఖ్య 18284కు చేరుకుంది. కొత్తగా నమోదైన 2768 పాజిటివ్‌ కేసులు తిరుపతి నగరంలో 647, మదనపల్లెలో 145, చిత్తూరులో 135, తిరుపతి రూరల్‌లో 130, కురబలకోటలో 115, శ్రీకాళహస్తిలో 114, పుత్తూరులో 96, చంద్రగిరి, పలమనేరుల్లో 91 వంతున, రేణిగుంటలో 70, పాకాలలో 68, రొంపిచెర్లలో 54, కుప్పంలో 51, పీలేరులో 46, మొలకలచెరువు, పులిచెర్లల్లో 39 చొప్పున, వి.కోట, ఏర్పేడుల్లో 37 చొప్పున, చిన్నగొట్టిగల్లులో 36, రామకుప్పంలో 35, జీడీనెల్లూరు, ఐరాల మండలాల్లో 30 వంతున, గంగవరం, వెదురుకుప్పం మండలాల్లో 27 చొప్పున, బైరెడ్డిపల్లె, గుడుపల్లె, నగరి, నారాయణవనం, పెద్దపంజాణి మండలాల్లో 26 వంతున, పూతలపట్టులో 25, బి.కొత్తకోటలో 24, బంగారుపాలెంలో 23, పీటీఎంలో 22, గుర్రంకొండ, కేవీపల్లె, శాంతిపురాల్లో 20 చొప్పున, చౌడేపల్లె, తొట్టంబేడుల్లో 19 వంతున, గుడిపాలలో 18, రామచంద్రాపురం, తంబళ్లపల్లె, ఎర్రావారిపాలెం మండలాల్లో 16 వంతున, పుంగనూరులో 15, కలకడలో 14, శ్రీరంగరాజపురం, యాదమరి మండలాల్లో 13 వంతున, కార్వేటినగరంలో 11, సోమల, వడమాలపేట, వరదయ్యపాలెం మండలాల్లో 10 వంతున, నాగలాపురం, పిచ్చాటూరు, సదుం మండలాల్లో 9 వంతున, కలికిరి, సత్యవేడు, వాల్మీకిపురం మండలాల్లో 8 వంతున, నిండ్రలో 7, తవణంపల్లెలో 6, కేవీబీపురం, నిమ్మనపల్లె, పెనుమూరు మండలాల్లో 5 వంతున, విజయపురంలో 4, పాలసముద్రం,పెద్దమండ్యం, రామసముద్రం మండలాల్లో 3 వంతున, బీఎన్‌ కండ్రిగలో 2 వంతున నమోదయ్యాయి.


ప్రభుత్వ కొవిడ్‌ సెంటర్లలో 1073 పడకల ఖాళీ 

తిరుపతిలోని ప్రభుత్వ కొవిడ్‌ ఆస్పత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో శనివారం రాత్రి 10 గంటలకు మొత్తం 1073  పడకలు ఖాళీగా ఉన్నాయి. విష్ణునివాసంలో 317 బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి. రుయాలో మొత్తం 195 ఖాళీ వున్నాయి. ఇందులో ఆక్సిజన్‌ 4, నాన్‌ ఆక్సిజన్‌ 191 ఖాళీగా ఉన్నాయి.   శ్రీనివాసంలో  406 బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి. టీటీడీ ఉద్యోగులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మాధవంలో 131 బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి. ఆయుర్వేద వైద్యశాలలో 24 నాన్‌ ఆక్సిజన్‌ బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి. 

Updated Date - 2021-05-02T07:00:45+05:30 IST