243కరోనా కేసులు...ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2021-08-27T06:31:43+05:30 IST

చిత్తూరు జిల్లాలో బుధ, గురువారాల నడుమ 24 గంటల్లో 243కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి.అదే సమయంలో ముగ్గురు మరణించినట్టు అధికార యంత్రాంగం గుర్తించింది. కొత్తగా నమోదైన ఈ పాజిటివ్‌ కేసులు, మరణాలతో జిల్లాలో ఇప్పటి వరకూ గుర్తించిన పాజిటివ్‌ కేసుల సంఖ్య 237023కు చేరుకోగా మరణాల సంఖ్య 1829కి పెరిగింది.

243కరోనా కేసులు...ముగ్గురి మృతి

తిరుపతి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బుధ, గురువారాల నడుమ 24 గంటల్లో 243కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి.అదే సమయంలో ముగ్గురు మరణించినట్టు  అధికార యంత్రాంగం గుర్తించింది. కొత్తగా నమోదైన ఈ పాజిటివ్‌ కేసులు, మరణాలతో జిల్లాలో ఇప్పటి వరకూ గుర్తించిన పాజిటివ్‌ కేసుల సంఖ్య 237023కు చేరుకోగా మరణాల సంఖ్య 1829కి పెరిగింది. కాగా గురువారం ఉదయం 9 గంటల సమయానికి జిల్లాలో 1657 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులున్నాయి. తాజా పాజిటివ్‌ కేసులు  తిరుపతిలో 43, తిరుపతి రూరల్‌లో 21, శ్రీకాళహస్తిలో 17, తొట్టంబేడులో 16, పీలేరులో 13, చిత్తూరులో 16, చంద్రగిరిలో 12, ఎర్రావారిపాళ్యం,బుచ్చినాయుడుకండ్రిగ మండలాల్లో  9చొప్పున, పూతలపట్టు, రేణిగుంట మండలాల్లో   7చొప్పున, కలికిరి, తవణంపల్లె మండలాల్లో   5చొప్పున, సోమలలో 4, చిన్నగొట్టిగల్లు, కంభంవారిపల్లె, పాకాల, పులిచెర్ల, సత్యవేడు, సదుం, వాల్మీకిపురం, మదనపల్లె మండలాల్లో   3చొప్పున, బి.కొత్తకోట, బంగారుపాళ్యం, , చౌడేపల్లె, ఐరాల, కేవీబీ పురం, కలకడ, వడమాలపేట, వరదయ్యపాళ్యం, విజయపురం, నగరి, పుత్తూరు మండలాల్లో 2చొప్పున, గంగాధరనెల్లూరు, గుడిపాల, గుర్రంకొండ, కుప్పం, ములకలచెరువు, నారాయణవనం, పెద్దమండ్యం, పెనుమూరు, పుంగనూరు, రామచంద్రాపురం, రొంపిచర్ల, తంబళ్లపల్లె, వెదురుకుప్పం మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. 

Updated Date - 2021-08-27T06:31:43+05:30 IST