తిరుమల ఘాట్‌లో 23 ఎర్రచందనం దుంగల స్వాధీనం

ABN , First Publish Date - 2021-12-31T07:53:52+05:30 IST

తిరుమల ఘాట్‌లో 23 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

తిరుమల ఘాట్‌లో 23 ఎర్రచందనం దుంగల స్వాధీనం
దుంగలను పరిశీలిస్తున్న ఎస్పీ సుందర రావు

తిరుపతి (కపిలతీర్థం), డిసెంబరు 30: తిరుమల ఘాట్‌లో 23 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ సుందరరావు తెలిపిన వివరాల మేరకు.. డీఎస్పీ మురళీధర్‌ ఆధ్వర్యంలో ఆర్‌ఎ్‌సఐలు వినోద్‌కుమార్‌, విశ్వనాథ్‌ బృందాలుగా ఏర్పడి బుధవారం రాత్రి తిరుమల ఘాట్‌లో  కూంబింగ్‌ చేపట్టారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్‌లోని వినాయకుడి ఆలయం వద్ద.. ఆరో కల్వర్టు పడమర వైపున కొందరు స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను మోసుకెళ్తూ తారసపడ్డారు. టాస్క్‌ఫోర్స్‌ బృందం వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేయడంతో దుంగలను వదిలేసి.. చీకట్లో పరారయ్యారు. అనంతరం సంఘటనా స్థలం నుంచి  23 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. 699 కిలోల బరువున్న ఈ దుంగల విలువ దాదాపు రూ.40లక్షలకుపైగా ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసును టాస్క్‌ఫోర్స్‌ సీఐ వెంకటరవి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్‌ఐ సురే్‌షకుమార్‌ రెడ్డి, సీఐ చంద్రశేఖర్‌, ఎఫ్‌ఆర్‌వో ప్రసాద్‌, ఎస్‌ఐ మోహన్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-31T07:53:52+05:30 IST