పేదల బియ్యాన్నీ బొక్కేశారు

ABN , First Publish Date - 2021-02-08T06:27:08+05:30 IST

శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాల పరిఽధిలో తిరుపతి విజిలెన్స్‌ అధికారులు దాడులు జరిపి 18టన్నుల రేషన్‌ బియ్యం స్వాఽధీనం చేసుకున్నారు.

పేదల బియ్యాన్నీ బొక్కేశారు
విజిలెన్స్‌ దాడుల్లో పట్టుబడిన రేషన్‌ బియ్యం, లారీ

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 7: శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాల పరిఽధిలో ఆదివారం తిరుపతి విజిలెన్స్‌ అధికారులు దాడులు జరిపారు. ఇందులో భాగంగా 700 బస్తాలు (18టన్నులు) రేషన్‌ బియ్యం, లారీని స్వాఽధీనం చేసుకున్నారు. తిరుపతి విజిలెన్స్‌ సీఐ అబ్బన్న కథనం మేరకు... శ్రీకాళహస్తి నుంచి అక్రమంగా రేషన్‌ బియ్యం తరలుతోందంటూ తిరుపతి విజిలెన్స్‌ అధికారులకు ఆదివారం తెల్లవారుజామున సమాచారం అందింది. దీంతో పలుప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో తొట్టంబేడు మండలం రామచంద్రాపురం, నెల్లిమానకండ్రిగ నడుమ వెళ్తున్న లారీని తనిఖీ చేశారు. అందులో రేషన్‌ బియ్యం ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్‌ అఽధికారుల బృందం అక్కడి నుంచి శ్రీకాళహస్తి పట్టణ శివారులోని రాజీవ్‌నగర్‌లోని రెండు ఇళ్లలో తనిఖీలు జరిపి, వంద బస్తాలకుపైగా రేషన్‌ బియ్యాన్ని గుర్తించారు. కేవీబీపురం మండలం కోవనూరుకు చెందిన రమేష్‌ ఈ బియ్యాన్ని విక్రయించడానికి తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. కాగా, నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. దాడుల్లో విజిలెన్స్‌ అధికారి విజయ్‌కుమార్‌రెడ్డి, పౌరసరఫరాల గోదాం డిప్యూటీ తహసీల్దారు వెంకటేశ్వర్లు, శ్రావణ్‌, వీఆర్వో చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-08T06:27:08+05:30 IST