ఆర్మీ ఉద్యోగాలకు 169మంది ఎంపిక

ABN , First Publish Date - 2021-08-20T07:17:45+05:30 IST

తిరుపతి సమీపంలోని తాటితోపులో గల ఎస్వీ డిఫెన్స్‌ అకాడమీ విద్యార్థులు 169 మంది ఆర్మీ సెలక్షన్స్‌లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

ఆర్మీ ఉద్యోగాలకు 169మంది ఎంపిక
ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులతో డాక్టర్‌ శేషారెడ్డి

ఎస్వీ డిఫెన్స్‌ అకాడమీ ఛైర్మన్‌ శేషారెడ్డి వెల్లడి 


తిరుపతి రూరల్‌, ఆగస్టు 19: తిరుపతి సమీపంలోని తాటితోపులో గల ఎస్వీ డిఫెన్స్‌ అకాడమీ విద్యార్థులు 169 మంది ఆర్మీ సెలక్షన్స్‌లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ వివరాలను గురువారం ఎస్వీ డిఫెన్స్‌ అకాడమీ చైర్మన్‌ డాక్టర్‌ శేషారెడ్డి మీడియాకు వివరించారు. గుంటూరులో ఇటీవల నిర్వహించిన ఆర్మీ సెలక్షన్స్‌లో తమ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి సోల్జర్‌ జీడీ, టెక్నికల్‌, నర్సింగ్‌, క్లర్క్‌ విభాగాల్లో 169మంది ఒకేసారి ఎంపికయ్యారన్నారు. తమ అకాడమీ ద్వారా ఇప్పటి వరకు 4861 మంది ఎయిర్‌ఫోర్స్‌, నేవీ ఉద్యోగాలు సాధించారని వివరించారు. ఇంటర్‌, డిగ్రీ విద్యతో పాటు సైనిక ఉద్యోగాలకు శిక్షణ అందిస్తున్నామన్నారు. భవిష్యత్తులో సైనిక ఉద్యోగాల నుంచీ సైనికాధికారులుగా తమ విద్యార్థులు ఎంపికయ్యేలా తీర్చిదిద్దుతామన్నారు. ఇప్పటికే 30 మంది పేద విద్యార్థులకు ఉచితంగా సైనిక శిక్షణ ఇస్తున్నామన్నారు. గుంటూరు ఆర్మీ ర్యాలీలో ఎంపికైన ఏ విద్యార్థికైనా ఉచితంగా రాత పరీక్షకు శిక్షణ అందిస్తామన్నారు. తల్లిదండ్రుల్లేని నిరుపేద విద్యార్థులకు తాము ఉచితంగా శిక్షణ అందించి, ఉద్యోగాలు పొందేందుకు సహకరిస్తామన్నారు. ఆర్మీ ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను డాక్టర్‌ శేషారెడ్డి అభినందించారు. ఈ సమావేశంలో అకాడమీ ప్రిన్సిపాల్‌ యోగానంద, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ బాబీ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-20T07:17:45+05:30 IST