జిల్లాకు చేరిన 1374 టన్నుల యూరియా
ABN , First Publish Date - 2021-10-29T06:46:44+05:30 IST
రబీ మొదలవుతున్న నేపథ్యంలో నాగార్జున కంపెనీ నుంచి 1,374 టన్నుల యూరియా జిల్లాకు వచ్చినట్లు వ్యవసాయ శాఖ ఫెర్టిలైజర్స్ ఏవో ప్రవీణ్ తెలిపారు.
చిత్తూరు (సెంట్రల్), అక్టోబరు 28: రబీ మొదలవుతున్న నేపథ్యంలో నాగార్జున కంపెనీ నుంచి 1,374 టన్నుల యూరియా గురువారం జిల్లాకు వచ్చినట్లు వ్యవసాయ శాఖ ఫెర్టిలైజర్స్ ఏవో ప్రవీణ్ తెలిపారు. జిల్లా రైతాంగానికి రబీలో ఎలాంటి ఎరువుల కొరత ఉండదన్నారు. ఎరువుల దుకాణం డీలర్లు నిర్ణయించిన ధరల పట్టికలను రైతుల సమాచారం కోసం దుకాణాల ముందు ఉంచాలన్నారు.