కేవీపల్లెలో 105.2 మి.మీ వర్షపాతం

ABN , First Publish Date - 2021-09-03T07:26:33+05:30 IST

జిల్లాలో గడిచిన 24 గంటల్లో 62 మండలాల్లో వర్షం కురిసింది. కేవీపల్లె మండలంలో అత్యధికంగా 105.2, బీఎన్‌ కండ్రిగలో అత్యల్పంగా 0.4 మి.మీ వర్షపాతం నమోదైంది.

కేవీపల్లెలో 105.2 మి.మీ వర్షపాతం
పీలేరు మండలం ఆకులవారిపల్లె వద్ద వర్షాలతో రోడ్డుపై పరవళ్లు తొక్కుతున్న పింఛా ఏరు

చిత్తూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 2: జిల్లాలో గడిచిన 24 గంటల్లో 62 మండలాల్లో వర్షం కురిసింది. కేవీపల్లె మండలంలో అత్యధికంగా 105.2, బీఎన్‌ కండ్రిగలో అత్యల్పంగా 0.4 మి.మీ వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా.. సదుంలో 79.2, కుప్పంలో 75, వి.కోటలో 70.6, ఎర్రావారిపాళ్యంలో 57.8, కలకడలో 57.4, పీలేరులో 56, గుడుపల్లెలో 55.4, కలికిరిలో 53, రామసముద్రంలో 52, సోమలలో 46.4, పాకాలలో 43.2, చౌడేపల్లెలో 39.2, శాంతిపురంలో 36.4, గంగవరంలో 33.6, పలమనేరులో 30.6, పెద్దపంజాణిలో 30.4, పుంగనూరులో 30.2, నిమ్మనపల్లెలో 29.6, సత్యవేడులో 28.2, పులిచెర్లలో 27.4, రామకుప్పంలో 26.4, గుర్రంకొండలో 25, చిన్నగొట్టిగల్లు, వెదురుకుప్పంలో 24.2, తంబళ్లపల్లెలో 24, చిత్తూరులో 23.2, కురబలకోటలో 22.4, బైరెడ్డిపల్లెలో 21.8, తవణంపల్లెలో 19.2, వరదయ్యపాళ్యం, రొంపిచెర్లలో 18.4, వాయల్పాడులో 17.6, పెద్దమండ్యంలో 17.4, రేణిగుంటలో 16.4, యాదమరిలో 15, మదనపల్లెలో 14.2, ఐరాలలో 14, ఎస్‌ఆర్‌పురంలో 13.4, తిరుపతి అర్బన్‌లో 13.2, చంద్రగిరిలో 12.2, బి.కొత్తకోటలో 11, మొలకలచెరువులో 10.2, తిరుపతి రూరల్‌లో 10 మి.మీ వర్షపాతం నమోదవగా, మిగిలిన మండలాల్లో పది మి.మీ.కంటే తక్కువ వర్షం కురిసింది. 


పుంజుకున్న నైరుతి 

నైరుతి రుతుపవనాల సీజన్‌లో మూడింతలు ముగిసింది. ఆగస్టులో తొలి రెండు వారాలు వర్షాభావ పరిస్థితులు తలెత్తినా, ఆ తర్వాత రుతుపవనాలు పుంజుకున్నాయి. చివరి వారంలో వర్షాలు పెరిగాయి. జూన్‌ ఒకటి నుంచి ఆగస్టు 31వరకు సాధారణ వర్షపాతం 288.9 మి.మీ కాగా 480.9 మి.మీ వర్షం కురిసింది. జూన్‌లో 78.7మి.మీ.కిగాను 111.2 మి.మీ(41.3 శాతం అధికం), జూలైలో 101.9 మి.మీ.కిగాను 223.1 మి.మీ (118.9 శాతం అధికం), ఆగస్టులో 117.4 మి.మీ.కిగాను 151.2 మి.మీ (28.8 శాతం అధికం)గా వర్షపాతం నమోదైంది. ఈ వర్షం మిట్ట ప్రాంతాల్లో ఖరీఫ్‌ సాగు పుంజుకోవడానికి ఉపకరించనుంది. ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో సాగులోని పంటలకు ఊరట మినహా సేద్యం అమాంతం పెరగడానికి ఉపయోగపడదని జిల్లా ప్రణాళిక శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు.

Updated Date - 2021-09-03T07:26:33+05:30 IST