10శాతం చార్జీల తగ్గింపు

ABN , First Publish Date - 2021-12-30T07:06:23+05:30 IST

తిరుపతి నుంచి బీహెచ్‌ఈఎల్‌, హైదరాబాదు, బెంగళూరు నగరాలకు రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సు చార్జీల్లో 10శాతం తగ్గించినట్లు మంగళం డిపో మేనేజర్‌ రాజవర్ధన్‌రెడ్డి తెలిపారు.

10శాతం చార్జీల తగ్గింపు

తిరుపతి నుంచి బీహెచ్‌ఈఎల్‌, హైదరాబాదు, బెంగళూరుకెళ్లే ఆర్టీసీ బస్సుల్లో వర్తింపు


తిరుపతి (కొర్లగుంట), డిసెంబరు 29: తిరుపతి నుంచి బీహెచ్‌ఈఎల్‌, హైదరాబాదు, బెంగళూరు నగరాలకు రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సు చార్జీల్లో 10శాతం తగ్గించినట్లు మంగళం డిపో మేనేజర్‌ రాజవర్ధన్‌రెడ్డి తెలిపారు. దీన్ని గురువారం నుంచి అమలు చేస్తున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

పాత, కొత్త చార్జీలిలా..

ఊరు గతంలో ప్రస్తుతం

తిరుపతి-బీహెచ్‌ఈఎల్‌ రూ. 1,380 రూ.1255

తిరుపతి-హైదరాబాదు రూ. 1,340 రూ.1215

తిరుపతి-బెంగళూరు రూ. 595  రూ.545

Updated Date - 2021-12-30T07:06:23+05:30 IST