రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ABN , First Publish Date - 2021-10-28T06:09:57+05:30 IST
మండలంలోని కొత్తప ల్లి శివారు జాతీయ రహదారిపై బుధవారం ద్విచక్ర వా హనాన్ని లారీ ఢీకొట్టడంతో యువకుడు చరణ్(30) మృ తి చెందాడు.

గుత్తిరూరల్, అక్టోబరు 27: మండలంలోని కొత్తప ల్లి శివారు జాతీయ రహదారిపై బుధవారం ద్విచక్ర వా హనాన్ని లారీ ఢీకొట్టడంతో యువకుడు చరణ్(30) మృ తి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలివి. అనంతపురానికి చెందిన చరణ్ గ్రామాల్లో టీ పొడి విక్రయిస్తూ జీ వనం కొనసాగించేవాడు. అందులోభాగంగా తాడిపత్రికి బయలుదేరాడు. కొత్తపల్లి శివారులో రోడ్డు పక్కన వాహనాన్ని నిలబెట్టి సెల్‌ఫోనలో మాట్లాడుతుండగా వెనక నుంచి లారీ వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో చరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పో స్టుమార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.