సిగ్నల్ రావాలంటే రెండు కిలోమీటర్లు వెళ్లాల్సిందే..
ABN , First Publish Date - 2021-07-24T06:16:43+05:30 IST
ప్రభుత్వం పేద ప్రజలకు అందించే రేషన బియ్యం పంపిణీకి సర్వర్ సమస్య గుదిబండగా మారింది. మండలంలోని తూముకుంట గ్రామంలో శుక్రవా రం సర్వర్ మొరాయించింది.

కుందుర్పి, జూలై 23: ప్రభుత్వం పేద ప్రజలకు అందించే రేషన బియ్యం పంపిణీకి సర్వర్ సమస్య గుదిబండగా మారింది. మండలంలోని తూముకుంట గ్రామంలో శుక్రవా రం సర్వర్ మొరాయించింది. దీంతో సర్వర్ సిగ్నల్ కోసం అంటూ లబ్ధిదారులు గ్రామం నుండి రెండు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చింది. అక్కడా గంటల తరబడి సిగ్నల్ కో సం వేచిచూస్తూ ఇబ్బందులుపడ్డారు. ఇంటి వద్దకే రేషన సంగతి దేవుడెరుగు... ఈ సిగ్నల్ కష్టాలు మాకొద్దంటూ లబ్ధిదారులు వేడుకుంటున్నారు. వ్యవసాయ పనుల సీజన కావడం తో రేషన కోసం రోజంతా కాపుకాచి కూలీ పనులు పొగొట్టుకుంటున్నామని పలువురు వాపోతున్నారు. అధికారులు స్పందించి రేషన పంపిణీకి సిగ్నల్ సమస్యను పరిష్కరించా లని గ్రామ లబ్ధిదారులు వేడుకుంటున్నారు.