కరోనా బాధితులకు యోగా

ABN , First Publish Date - 2021-05-24T05:42:07+05:30 IST

కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో వైద్యసేవలుపొందుతున్న బాధితులకు మానసిక ఉల్లాసం, ఆనందం కోసం యోగాతో పాటు ఆటలను సైతం ఆడిస్తున్నారు.

కరోనా బాధితులకు యోగా

పుట్టపర్తి, మే 23: కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో వైద్యసేవలుపొందుతున్న బాధితులకు మానసిక ఉల్లాసం, ఆనందం కోసం యోగాతో పాటు ఆటలను సైతం ఆడిస్తున్నారు. ఆదివారం స్థానిక పర్తిసాయి ధర్మశాలలోని కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రాము ఆధ్వర్యంలో యోగా, ప్రాణాయామం, క్యాలంబోర్డు, వాలీబాల్‌ ఆటలతో పాటు ఉ ల్లాసం కోసం మ్యూజికల్‌ సిస్టం ఏర్పాటు చేశారు. బాధితుల్లో ఉన్న అనుమానాలు, భయాన్ని పొగొట్టి మానసిక ఉల్లాసాన్ని కల్గిస్తున్నట్లు డాక్టర్‌ రాము తెలిపారు.


Updated Date - 2021-05-24T05:42:07+05:30 IST