వైసీపీ దౌర్జన్య కాండ

ABN , First Publish Date - 2021-06-22T06:42:30+05:30 IST

- ముష్టికోవెలలో టీడీపీ వర్గీయులపై దాడి

వైసీపీ దౌర్జన్య కాండ
తీవ్రంగా గాయపడిన ఆంజనేయులు- ఇద్దరికి తీవ్రగాయాలు.. పరిస్థితి విషమం

- గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు

చెన్నేకొత్తపల్లి, జూన 21: మండలంలోని ముష్టికోవెల గ్రామంలో సోమవారం వైసీపీ వర్గీయుల దాడిలో టీడీపీ వర్గీయులైన తండ్రీ కొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు, పోలీసులు తెలిపిన మేరకు... గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయుడు పందిపర్తి ఆంజ నేయులు ఇంటి సమీపంలో కొందరు క్రికెట్‌ ఆడుతున్నారు. ఈ సంద ర్భంలో క్రికెట్‌ బంతివచ్చి ఇంటి వద్ద ఉన్న ఆంజనేయులు పిల్లలకు తగిలింది. దీంతో కుటుంబసభ్యులు క్రికెట్‌ ఆడుతున్న పిల్లలను మం దలించారు. విషయం తెలుసుకున్న వైసీపీకి చెందిన చంద్రశేఖర్‌ వ ర్గీయులు తమ పిల్లలనే మందలిస్తారా అంటూ ఒక్కసారిగా పెద్ద ఎత్తున కర్రలు, ఇనుపరాడ్లు తీసుకుని ఆంజనేయులు ఇంటిపై దాడికి దిగారు. ఈ దాడులలో టీడీపీ వర్గీయులైన తండ్రీకొడుకులు పందిపర్తి ఆంజనేయులు, నరసింహులుకు తీవ్రగాయాలు కాగా... అడ్డుకోబో యిన ఇద్దరు మహిళలు గాయపడినట్టు తెలిసింది. వారిని చెన్నేకొత్తపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచనల మేరకు అనంతపురం తరలించినట్టు బంధువులు తెలిపారు. విషయం తెలుసుకున్న రామగిరి సీఐ చిన్నగౌస్‌, ఎస్‌ఐ శ్రీధర్‌ ముష్టికో వెలకు చేరుకుని విచారణ చేపట్టారు. బాధితుల కుటుంబసభ్యులు ఇచ్చిన పిర్యాదు మేరకు తొమ్మిది మంది వైసీపీ వర్గీయులపై కేసు నమోదు చే సినట్టు సీఐ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. టీడీపీ వర్గీయు లపై దాడిని ఆ పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. బంతి తగిలిన విషయంలో పిల్లలను మందలించడాన్ని వైసీపీ నాయకులు రాజకీయంగా వాడుకుని దాడులకు దిగడం వారి దౌర్జన్యకాండకు పరాకాష్టగా నిలుస్తోం దన్నారు. పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి తగిన న్యాయం చేయాలని కోరారు.


Updated Date - 2021-06-22T06:42:30+05:30 IST