ఇదేమి చిత్రం..?

ABN , First Publish Date - 2021-05-05T05:58:13+05:30 IST

స్థానికుల పుణ్యమా అని మంగళవారం ఆ పాఠశాల ను పొట్టేళ్ల రక్తంతో అభిషేకం చేశారు. ఈ విచిత్ర ఘటన జిల్లా కేంద్రమైన అనంతపురం నగరపాలక సంస్థలో చోటుచేసుకుంది.

ఇదేమి చిత్రం..?
శ్రీనివాస పాఠశాల ప్రాంగణంలో పొట్టేలును కోస్తున్న దృశ్యం

 పాఠశాల ప్రాంగణాన్ని జంతు వధశాలగా మార్చిన ఘనులు

పొట్టేళ్లను కోసి... మాంసం కుప్పలు వేసిన వైనం

అనంతపురం కార్పొరేషన, మే4 : అదేమీ ఊర్లోని రచ్చబండ కాదు...మటన సెంటర్‌ అసలే కాదు. విద్యార్థులు చదువుకునే పాఠశాల ప్రాంగ ణం. స్థానికుల పుణ్యమా అని  మంగళవారం ఆ పాఠశాల ను పొట్టేళ్ల రక్తంతో అభిషేకం చేశారు. ఈ విచిత్ర ఘటన జిల్లా కేంద్రమైన అనంతపురం నగరపాలక సంస్థలో చోటుచేసుకుంది. నగరం లోని శ్రీనివాస్‌నగర్‌లో ఉన్న శ్రీనివాస నగరపాలక ప్రాథమిక పాఠశాలలో పొట్టేళ్లను కోశారు. విషయం బయటకు పొక్కడంతో కార్పొరేషన అధికారులు వెంటనే అక్కడికి వెళ్లి ఆరా తీసి మందలించారు. ఆ వ్యవహారమంతా బయటే చేసుకోవాలని దండించి బయటకు పంపారు. 

ఏం జరిగిందంటే...

కరోనా నేపథ్యంలో మంగళవారం ఆ పాఠశాల లో వ్యాక్సినేషన ప్రక్రియ నిర్వహించాలి. అయితే అనివార్య కారణాలతో ఆ ప్రక్రియ చేపట్టలేదు. ప్రస్తుతం పాఠశాలలు కూడా నిర్వహించని విషయం తెలిసిందే. వ్యాక్సినేషన ఉంటుందని ఆ పాఠశాల ప్రఽధానోపాధ్యాయు రాలు వాచ మ్యానకు తాళాలు ఇచ్చి వెళ్లారట. ఇదే సందర్భంలో మంగళ వారమే ఆ ప్రాంతంలో దేవర నిర్వ హించారట. వ్యాక్సినేషన లేకపోవ డంతో ముందురోజు రాత్రి పొట్టేళ్లను పాఠశాల ప్రాంగణంలో ఉంచుతా మని, ఉదయమే తీసు కెళ్తామని ఆ ప్రాంతంవారు వాచమెనను అడిగా రట. ఆ విషయమే అతడు ప్రధానో పాధ్యాయురాలికి చెప్పడం... అంత వరకే అనడంతో ఆమె  ఓకే చెప్ప డం జరిగిపోయినట్లు తెలిసింది. అయితే ఆ దేవర జరుపుకున్న ఘనులు...వ్యాక్సినేషన లేదు...పాఠశా ల కూడా నడవడం లేదు కదా అనుకున్నారేమో... ఏకంగా దేవరలో బలి ఇచ్చిన పొట్టేళ్లను ఆ పాఠశాల ప్రాంగణంలో చెట్లకొమ్మలకు తగిలించి... మాంసాన్ని కుప్పలుగా పోశారట. 


Updated Date - 2021-05-05T05:58:13+05:30 IST