ఆరోగ్యశ్రీ వర్తించే జబ్బులకు డబ్బులు వసూలు చేయడం ఏమిటీ?

ABN , First Publish Date - 2021-01-13T07:00:50+05:30 IST

పట్టణంలో ఆరోగ్యశ్రీ వర్తించే ఆసుపత్రుల్లో డబ్బులు వసూలు చేయడం ఏంటని జాయింట్‌ కలె క్టర్‌ డాక్టర్‌ సిరి ఆగ్రహం వ్యక్తం చేశా రు.

ఆరోగ్యశ్రీ వర్తించే జబ్బులకు డబ్బులు వసూలు చేయడం ఏమిటీ?
ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్‌తో చర్చిస్తున్న జేసీ

కో-ఆర్డినేటర్‌పై జేసీ సిరి ఆగ్రహం 


హిందూపురం టౌన్‌, జనవరి 12: పట్టణంలో ఆరోగ్యశ్రీ వర్తించే ఆసుపత్రుల్లో డబ్బులు వసూలు చేయడం ఏంటని జాయింట్‌ కలె క్టర్‌ డాక్టర్‌ సిరి ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఇటీవల హిందూపురం ఆరోగ్యశ్రీ అమలు అవుతున్న ప్రైవే ట్‌ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తించే జబ్బులకు డబ్బులు వసూలు చే స్తూ బిల్లులు ఇవ్వడంపై కలెక్టర్‌కు ఫి ర్యాదు చేశారు. దీనిపై మంగళవా రం ఇన్‌చార్జి కలెక్టర్‌ పట్టణంలోని తేజనర్సింగ్‌హోం ఆసుపత్రిని తనిఖీచేశారు. ఈ సందర్భంగా రోగులకు అందిస్తున్న వైద్యంపై ఆరాతీశారు. అంతేకాక ఆరోగ్యశ్రీ వర్తించే వాటికి కూడా చెత్తకాగితంలో బిల్లులు రాయడం ఏంటని ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్‌ను ప్రశ్నించారు. పద్ధతి మార్చుకోకపోతే ఆరోగ్యశ్రీ సేవలను రద్దు చేస్తామని హెచ్చరించారు. దీనిపై పూర్తిస్థాయిలో నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపుతామన్నారు. మరికొన్ని ఆసుపత్రులకు కూడా త్వరలోనే తనిఖీ చేస్తానని కోఆర్డినేటర్‌కు తెలిపారు. అనంతరం  సచివాలయాలను తనిఖీ చేశారు. సచివాలయాల్లో అందుతున్న సేవలు, సంక్షేమ పథకాలపై బోర్డు సరిగా ఏర్పాటు చేయలేదని ఇలాగే విధులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాసులు, మునిసిపల్‌ కమిషనర్‌, వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-13T07:00:50+05:30 IST