పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు : మంత్రి
ABN , First Publish Date - 2021-07-08T06:02:15+05:30 IST
పార్టీలకు అతీతంగా సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని మంత్రి శంకర్‌నారాయణ పేర్కొన్నారు.

పెనుకొండ రూరల్, జూలై 7: పార్టీలకు అతీతంగా సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని మంత్రి శంకర్‌నారాయణ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని వెంకటగిరిపాళ్యంలో రూ.40లక్షలతో నిర్మితమైన గ్రామ సచివాలయ నిర్మాణ భవనంను ఆయన ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రజల్లోకి పథకాలు శరవేగంగా వెళ్లాలనే లక్ష్యంతో సీఎం జగన సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేశారన్నారు. సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్క లబ్దిదారునికి సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అనంతరం రూ.40లక్షలతో నిర్మితమైన సచివాలయంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శివశంకరప్ప, పంచాయతీరాజ్ డీఈ మురళి, సర్పంచ లక్ష్మీదేవి, మండల కన్వీనర్ శ్రీకాంతరెడ్డి, గుట్టూరు సర్పంచ శ్రీరాములు, సుధాకర్‌రెడ్డి, రామ్మోహనరెడ్డి, ఆదినారాయణ, కొండలరాయుడు, అశ్వత్థరెడ్డి తదితరులు పాల్గొన్నారు.