ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం

ABN , First Publish Date - 2021-12-08T05:46:16+05:30 IST

ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళతామని మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు.

ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం
మీర్జాపురం గ్రామంలో పర్యటిస్తున్న పల్లె రఘునాథరెడ్డి

మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి

పుట్టపర్తిరూరల్‌, డిసెంబరు 7: ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళతామని మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక తెలుగుదేశం పార్టీకార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బుధవారం నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా మూడునెలలపాటు ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామసభలు ఏర్పాటు చేసి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను, ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరని, పార్టీలో కష్టపడే వారికి గుర్తింపు ఉంటుందన్నారు. 


Updated Date - 2021-12-08T05:46:16+05:30 IST