జలమయమైన కేజీబీవీ ఆవరణ

ABN , First Publish Date - 2021-01-12T06:31:22+05:30 IST

స్థానిక కేజీబీవీ పాఠశాల ఆవరణ సోమవా రం జలమయమైంది. హెచ్చెల్సీ నిల్వ నీరు (బ్యాక్‌వాటర్‌) ఒక్కసారిగా పా ఠశాలను చుట్టేశాయి.

జలమయమైన కేజీబీవీ ఆవరణ
పాఠశాల ఆవరణలోకి వచ్చిన నీటిని పరిశీలిస్తున్న ఎంపీడీఓ

చొరబడుతున్న హెచ్చెల్సీ నిల్వనీరు

ఇబ్బందుల్లో విద్యార్థులు, అధ్యాపకులు


కణేకల్లు, జనవరి 11: స్థానిక కేజీబీవీ పాఠశాల ఆవరణ సోమవా రం జలమయమైంది. హెచ్చెల్సీ నిల్వ నీరు (బ్యాక్‌వాటర్‌) ఒక్కసారిగా పా ఠశాలను చుట్టేశాయి. దీంతో విద్యార్థులు, అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారం రోజుల క్రితం హెచ్చెల్సీ నీరు స్థానిక చిక్కణ్ణేశ్వర చె రువులోకి నిండుగా రావడంతో నిల్వ నీరంతా పాఠశాల ఆవరణలోకి మూ డు అడుగుల మేర చేరింది. విద్యార్థినులు, ఉపాధ్యాయులు ఆవరణం నుంచి తరగతి గదుల్లోకి వెళ్లేందుకు మడుగులా చేరిన నీటిని దాటుతూ వెళ్లాల్సి వచ్చింది. నీటి ప్రవాహంలో పాములు కూడా వస్తుండటంతో  బి క్కు బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వుండాల్సిన పరిస్థితు లు ఏర్పడ్డాయి. పలువురు తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. నీరు ఇలా నిల్వ వుంటే విద్యార్థులు ఏ వి ధంగా చదువుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ఎంపీడీవోకు ఫిర్యాదు 

కేజీబీవీని చుట్టేసిన నీటి పరిస్థితిపై విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఎస్‌ఓ మంజుల, సి బ్బంది.. ఎంపీడీఓ విజయభాస్కర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన పాఠశాల వద్దకు వచ్చి పరిశీలించారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్‌ఓ మాట్లాడుతూ పాఠశాల ఆవరణలోకి హెచ్చెల్సీ నీరు రాకుండా అడ్డుకట్ట వేయాలని కోరారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని విన్నవించారు. 

Updated Date - 2021-01-12T06:31:22+05:30 IST