నీటి పథకాలకు నిధుల కొరత

ABN , First Publish Date - 2021-08-27T06:00:04+05:30 IST

జిల్లాలో తాగు నీటి పథకాల నిర్వహణకు కాసుల కష్టాలు వెంటాడుతు న్నాయి. రెండేళ్లుగా నిర్వహణ నిధు లు అంతంత మాత్రం గానే వస్తుండటంతో బకాయిలు కుప్పలుగా పేరుకు పో యాయి.

నీటి పథకాలకు నిధుల కొరత

రెండేళ్లుగా నిర్వహణ నిధులు అంతంతే

కుప్పలుగా పేరుకుపోతున్న బకాయిలు

చేతులెత్తేసే స్థితిలో కాంట్రాక్టర్లు

వేతనాల కోసం సిబ్బంది ఆందోళన

వానా కాలంలోనూ తాగునీటి కష్టాలు

పాలకులు, అధికారుల మౌనంపై విమర్శలు

అనంతపురం వైద్యం, ఆగస్టు 26: జిల్లాలో తాగు నీటి పథకాల నిర్వహణకు కాసుల కష్టాలు వెంటాడుతు న్నాయి. రెండేళ్లుగా నిర్వహణ నిధు లు అంతంత మాత్రం గానే వస్తుండటంతో బకాయిలు కుప్పలుగా పేరుకు పో యాయి. దీంతో కాంట్రాక్టర్లు సైతం ఈ పథకాల నిర్వహ ణ తమ చేత కాదని చేతులు ఎత్తేసే పరిస్థితికి వచ్చారు. మరోవైపు ఈ పథకాలలో పనిచేస్తున్న సిబ్బంది వేతనాల కోసం విధులు బహిష్కరించి సమ్మెకు దిగుతున్నారు.  ఇక నీటి పథకాల యం త్రాలు పాడైపోతే వాటిని మరమ్మతు చేయించే పరిస్థితి కూడా కనిపించడం లేదు. దీంతో వానా కాలంలోనూ జిల్లాలో తాగునీటి కష్టాలు తప్ప టం లేదు. జిల్లాలో  63 మండలాల్లో తాగునీటి కోసం 12676 చేతి పంపులు ఉన్నాయి. ఇందులో 7378 మాత్రమే పని చేస్తున్నాయి. రక్షిత మంచినీటి పథకాలు 5277 గ్రామాల్లో ఉన్నాయి. ఈ పథకాలు ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజలకు మాత్రమే తాగునీటిని అందిస్తున్నాయి. మరో 61 బహుళ రక్షిత మంచినీటి పథకాలు ఉన్నాయి. ఇవి ఒక ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు తా గునీటిని సరఫరా చేసి దాహార్తిని తీరుస్తున్నాయి. ఇందులో ప్రధానంగా శ్రీరామ రెడ్డి తాగునీటి పథకం, సత్యసాయి తాగునీటి పథకం, పీఏబీఆర్‌ తాగునీటి పథకం, జేసీనాగిరెడ్డి తాగునీటి పథకాలు చాలా కీలకం. శ్రీరామరెడ్డి పథకం ద్వారా మడ కశిర, హిందూపురం, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవ కొండ నియోజకవర్గాల్లో అనేక గ్రామాలకు నీటిని అంది స్తున్నారు. జేసీ నాగిరెడ్డి పథకం ద్వారా తాడిపత్రి, గుత్తి, శింగనమల, అనంతపురం, ధర్మవరం నియోజకవర్గాల్లో దా దాపు 514 గ్రామాలు మున్సిపాలిటీలకు తాగునీటిని అందిస్తున్నారు. ఇక సత్యసాయి తాగునీటి పథకం ద్వారా కూడా జిల్లాలో పలు నియోజకవర్గాల్లో 680 గ్రామాలకు తాగునీటిని సరఫరా చే స్తున్నారు. ఇన్ని పథకాలు ఉన్నా నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చి న తర్వాత తాగునీటి పథకాల  నిర్వహణకు స కాలంలో నిధులు ఇవ్వడం లేదు. దీంతో నిర్వహణ భారంగా మారింది.  దాదాపు రూ.35 కో ట్లు కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నుంచి నిధులు బకాయి ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో ఈ పథకాల ద్వారా ఏ చిన్న సమస్య వచ్చినా వాటిని మ రమ్మతు చేయించే పరిస్థితిలో ఇటు అధికారులు అటు కాంట్రాక్టర్లు లేరు. సత్యసాయి పథకం నిర్వహించే ఎల్‌అం డ్‌టీ సంస్థ సైతం బకాయి లు పేరుకుపోవడంతో తాము నిర్వహించలేమని ప్రభుత్వానికి తెగేసి చెప్పేసింది. అదే బాటలోనే శ్రీరామరెడ్డి, జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకాలు సాగుతున్నాయి. చివరకు నీటి పథకాలను సక్రమంగా నడిచే విధంగా చూస్తున్న సిబ్బందికి సైతం వేతనాలు చెల్లించడం లేదు. గత నెల రో జుల కిందట జీతాల కోసం సత్యసాయి, శ్రీరామరెడ్డి పథకాల సిబ్బంది సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. అప్పుడు ఏదో కొంత మేరా డబ్బులు ఇచ్చి శాంతింప చేశారు. మళ్లీ డబ్బులు మంజూ రు చేయ లేదు. దీంతో కాంట్రాక్టర్లు నిర్వహణపై అయోమయంలో పడ్డారు. చిన్న బోరు మరమ్మతు చేయించాలన్న పైసలు లేక ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు క్షేత్రస్థాయిలో ఎంపీడీ ఓలు, సర్పంచలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 


‘జల్‌జీవన’కు తప్పని కాసుల తిప్పలు

ప్రతి ఇంటికి కొళాయి ఏర్పాటు చేసి తాగునీటిని సరఫరా చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా జల్‌జీవన మిషన పథకంను తీసుకొచ్చాయి. జిల్లాలోనూ అనంతపురం మినహా ఇతర 13 నియోజకవర్గాల్లో ఈ పనులు మంజూరయ్యాయి. 3267 గ్రామాల్లో 451315 ఇళ్లకు ఇంటింటికి కొళాయి ఏర్పాటు లక్ష్యం పెట్టుకున్నారు. ఇందుకోసం రూ.182.45 కోట్లు మంజూరయ్యాయి. నామి నేషన ప్రాతిపదికన ఈ పనులు అప్పగించగా 2082 పనులు గత ఏడాది ప్రారంభించారు. పైప్‌లైన విస్తరణ, కొళాయిల బిగింపు, సంబంధిత కాంట్రాక్టర్లు చేపట్టారు. నిధులు మంజూరు కాకపోవడంతో ఈ పనులు నత్తనడక న సాగుతున్నాయి. కాంట్రాక్టర్లు సైతం బిల్లులు కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయ తీరాజ్‌ శాఖ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం తో జల్‌జీవన సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. జిల్లాలో తాగునీటి పథకాల పరిస్థితి నిధుల కొరతతో ఇంతటి దుర్భరంగా ఉన్నా ఇటు పాలకులు, అటు అధికారులు ఏ మాత్రం పట్టించుకోకుండా మౌనంగా ఉంటుండడం పలు విమర్శలకు దారితీస్తున్నాయి. ఇంకోవైపు ఈ తాగునీటి పథకాల నిర్వహణను దక్కించుకోవటానికి ఇద్దరు, ముగ్గు రు ఎమ్మెల్యే లు ప్రయత్నిస్తుండటం విమర్శలకు తావిస్తోం ది. 


Updated Date - 2021-08-27T06:00:04+05:30 IST