రోడ్డు ప్రమాదంలో వార్డు అభ్యర్థి మృతి

ABN , First Publish Date - 2021-02-05T06:35:01+05:30 IST

మండలం తలమర్లవాండ్లపల్లి పంచాయతీ 3వ వార్డు అభ్యర్థి రామచంద్ర (45) ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడి మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో వార్డు అభ్యర్థి మృతి
రామచంద్ర మృతదేహం

 నల్లచెరువు, ఫిబ్రవరి 4 : మండలం తలమర్లవాండ్లపల్లి పంచాయతీ 3వ వార్డు అభ్యర్థి రామచంద్ర (45) ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడి మృతి చెందాడు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల మేరకు వనంవారిపల్లికి చెందిన రామచంద్ర ద్విచక్ర వాహనంలో గ్రామంలో వెళ్తుండగా ద్విచక్ర వాహనానికి కుక్క అడ్డు రావడంతో ప్రమాదవ శాత్తూ కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన రామచంద్రను 108 వాహనంలో కదిరి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. రామచం ద్ర మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ సంఘటన పై ఎస్‌ఐ మునీర్‌అహమ్మద్‌ కేసు నమోదు చేశారు. మృతునికి భార్య,కుమారు డు, కుమార్తె ఉన్నారు.  

Updated Date - 2021-02-05T06:35:01+05:30 IST