బిందెడు నీటి కోసం అర కిలోమీటరు నడిచి...

ABN , First Publish Date - 2021-07-24T06:13:09+05:30 IST

మండలంలోని దుద్దేకుంట గ్రా మస్థులను తాగునీటి సమస్య వెంటాడుతోంది. బిందెడు నీటి కోసం అర కిలోమీటరు నడిచి వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఎదురవుతోంది.

బిందెడు నీటి కోసం అర కిలోమీటరు నడిచి...
సత్యసాయి పైపుల వద్ద లీకేజీ నీటిని పట్టుకుంటున్న దుద్దేకుంట గ్రామస్థులు

బెళుగుప్ప, జూలై 23: మండలంలోని దుద్దేకుంట గ్రా మస్థులను తాగునీటి సమస్య వెంటాడుతోంది. బిందెడు నీటి కోసం అర కిలోమీటరు నడిచి వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఎదురవుతోంది. అంకంపల్లి, దుద్దేకుంట గ్రామాల మధ్య హంద్రీనీవా కాలువలో ఉన్న సత్యసాయి తాగునీటి సరఫరా  పైపుకు రంధ్రాలు పెట్టి నీటిని తోడుకుంటున్నారు. అధికారు లు స్పందించి తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీ సుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. సెక్రెటరీ జగదీ్‌షను వివరణ కోరగా, సత్యసాయి తాగునీటి ప్రాజెక్టు సిబ్బంది స మ్మెలో ఉండటంతో సమస్య ఏర్పడిందని, పరిష్కరించేందు కు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - 2021-07-24T06:13:09+05:30 IST