మట్టి రవాణాను అడ్డుకున్న గ్రామస్థులు

ABN , First Publish Date - 2021-12-08T05:23:42+05:30 IST

వెంచర్లకు అక్రమంగా మట్టిని తరలిస్తున్న వాహనాలను గ్రామస్థులు అడ్డుకుని వెనక్కు పంపారు.

మట్టి రవాణాను అడ్డుకున్న గ్రామస్థులు

పరిగి, డిసెంబరు 7: వెంచర్లకు అక్రమంగా మట్టిని తరలిస్తున్న వాహనాలను గ్రామస్థులు అడ్డుకుని వెనక్కు పంపారు. పరిగి మండలం యర్రగుంట చెరువు సమీపంలో అక్రమంగా హిటాచీ, లారీల ద్వారా రియల్‌ వ్యాపారి వెంచర్ల కోసం అక్రమంగా మట్టిని తరలిస్తుండగా మంగళవారం గ్రామస్థులు అడ్డుకున్నారు. ఇరిగేషన అధికారులు రియల్‌ వ్యాపారులవద్ద మామూళ్లు తీసుకుని వారికి ఇష్టమొచ్చిన రీతిలో అనుమతులు ఇచ్చి మట్టిని తోలిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. వ్యవసాయ పొలాలకు మట్టిని సరఫరాచేసేందుకు అనుమతి తీసుకుని ఒక్కో క్యూబెక్‌ మీటరుకు రూ.60.50చొప్పున 178 ట్రాక్టర్లకు రియల్‌ వ్యాపారి అనుమతి తీసుకున్నాడన్నారు. అయితే ట్రాక్టర్ల ద్వారా అధికారులు ఏమాత్రం అనుమతి ఇచ్చారో అంతే తీసుకెళ్లాలి కానీ హిటాచీల ద్వారా టిప్పర్లతో మట్టిని తోలుకుంటున్నారంటే వీరికి అధికారులు, అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నాయని ఆరోపించారు. చిన్నారులెవరైనా గుంతల్లో పడి ప్రాణాపాయం జరిగితే దిక్కెవరి వారు ప్రశ్నించారు. మా గ్రామ సమీపంలో మట్టిని తోలరాదంటూ వాహనాలను వెనక్కు పంపారు. ఈ విషయమై మైనర్‌ ఇరిగేషన డీఈ యోగానంద్‌ను వివరణ కోరగా మేము ట్రాక్టర్ల ద్వారా మట్టిని తోలేందుకు అనుమతి ఇచ్చామేతప్ప లారీలు, హిటాచీలకు అనుమతి ఇవ్వలేదన్నారు. 

Updated Date - 2021-12-08T05:23:42+05:30 IST