విలేజ్‌ల విక్టరీ
ABN , First Publish Date - 2021-05-21T06:10:19+05:30 IST
మడకశిర నియోజకవర్గంలోని 55 గ్రామాలు కరోనా బారిన పడకుండా ఆదర్శంగా నిలిచాయి.

నియోజకవర్గంలో కరోనా సోకని 55 గ్రామాలు
మడకశిరటౌన్, మే 20 : మడకశిర నియోజకవర్గంలోని 55 గ్రామాలు కరోనా బారిన పడకుండా ఆదర్శంగా నిలిచాయి. మండలాల వారీగా చూస్తే.. మడకశిరలో 28 గ్రామాలు, అమరాపురంలో 6, గుడిబండలో 8, రొళ్లలో 9 గ్రామాలు ప్రధానంగా ఉన్నాయి. మరో నాలుగు గ్రామాలు ఇతర మండలాల్లో ఉన్నాయి. ఈ గ్రామాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. కాగా అగళి మండలంలో మాత్రం అన్ని గ్రామాల్లో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి గురువారం కాస్త తగ్గుముఖం పట్టినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. నియోజకవర్గంలో 87 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. మడకశిర మండలంలో 40 కేసులు, అమరాపురం 26, గుడిబండ 11, రొళ్ల 7, అగళి 3 కేసులు నమోదైనట్లు వెల్లడించారు.