నేటి సాయంత్రంలోగా వ్యాక్సినేషన లక్ష్యాన్ని అందుకోవాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-10-21T06:22:38+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సినేషన లక్ష్యాన్ని గురువారం సాయంత్రంలోగా అందుకోవాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన.. సంబంధిత అధికారులను ఆదేశించారు.

నేటి సాయంత్రంలోగా వ్యాక్సినేషన లక్ష్యాన్ని అందుకోవాలి : కలెక్టర్‌

అనంతపురం, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ వ్యాక్సినేషన లక్ష్యాన్ని గురువారం సాయంత్రంలోగా అందుకోవాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన.. సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి జేసీ సిరి, పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ నవీన, జిల్లా వైద్యాధికారి కామేశ్వర ప్రసాద్‌, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, వైద్యాధికారులు, మండల ప్రత్యేకాధికారులతో కొవిడ్‌ మెగా వ్యాక్సినేషనపై టెలీ కాన్ఫరెన్స నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... జిల్లాకు కేటాయించిన 2 లక్షల డోసుల్లో మంగళవారం 30 వేలు, బుధవారం 32 వేలు పూర్తి చేశారన్నారు. గురువారం సాయంత్రంలోగా మిగిలిన 1.60 లక్షల డోసుల లక్ష్యాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు. వ్యాక్సినేషనపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతిఒక్కరూ కొవిడ్‌ వ్యాక్సిన వేయించుకునేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.


‘జగనన్న తోడు’ ద్వారా 67,071 మందికి లబ్ధి

జిల్లాలో జగనన్న తోడు పథకం ద్వారా 67,071 మందికి లబ్ధి చేకూర్చినట్లు కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన పేర్కొన్నారు. బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స ద్వారా జగనన్న తోడు పథకం ద్వారా లబ్ధిదారులకు వడ్డీ జమచేసే కార్యక్రమాన్ని చేపట్టారు. కలెక్టరేట్‌ నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్సకు ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డితోపాటు కలెక్టర్‌ నాగలక్ష్మి, జిల్లా పరిషత చైర్‌పర్సన బోయ గిరిజమ్మ, ఎమ్మెల్యేలు తిప్పేస్వామి, శ్రీధర్‌ రెడ్డి, జేసీలు డా.సిరి, గంగాధర్‌ గౌడ్‌ హాజరయ్యారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ, మెప్మా పీడీలు నరసింహారెడ్డి, రమణారెడ్డి, చిరు వ్యాపారులు, వృత్తిదారులు పాల్గొన్నారు.


స్వచ్ఛత, పరిశుభ్రత ఓ అలవాటుగా చేసేందుకే స్వచ్ఛ సంకల్పం

స్వచ్ఛత, పరిశుభ్రతలను ప్రజలకు ఓ అలవాటుగా మార్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం చేపడుతోందని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆమె తన క్యాంపు కార్యాలయం నుంచి జేసీ సిరితో కలిసి వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... వంద రోజుల కార్యచరణలో భాగంగా గురువారం మండల స్థాయి, గ్రామ స్థాయిల్లో అధికారులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నారు.

Updated Date - 2021-10-21T06:22:38+05:30 IST