కరోనా కట్టడికి వ్యాక్సినేషనే శాశ్వత పరిష్కారం

ABN , First Publish Date - 2021-06-21T05:50:05+05:30 IST

కరోనా కట్టడికి వ్యాక్సినేషన ప్ర క్రియ శాశ్వత పరిష్కారమని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నా రు.

కరోనా కట్టడికి వ్యాక్సినేషనే శాశ్వత పరిష్కారం
నగరంలోని 64వ సచివాలయంలో వ్యాక్సినేషన ప్రక్రియ పరిశీలిస్తున్న ఎమ్మెల్యే, జేసీ

అనంతపురం కార్పొరేషన,జూన20 : కరోనా కట్టడికి వ్యాక్సినేషన ప్ర క్రియ శాశ్వత పరిష్కారమని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నా రు. నగరంలోని రెండోరోడ్డులో ఉన్న 64వ సచివాలయంలో ఆదివారం ని ర్వహించిన కొవిడ్‌ మెగా వ్యాక్సినేషన డ్రైవ్‌ను ఎమ్మెల్యే అనంతవెంకటరా మిరెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ సిరి, నగర మేయర్‌ మహమ్మద్‌ వసీం, క మిష నర్‌ పీవీవీఎస్‌ మూర్తి పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాటా ్లడుతూ... కరోనా నేపథ్యంలో పెద్ద ఎత్తున కొవిడ్‌ మెగా వ్యాక్సినేషన డ్రైవ్‌ను ప్రభుత్వం చేపట్టిందన్నారు. కరోనా థర్డ్‌వేవ్‌ వచ్చే అవకాశమున్న క్రమం లో... దానిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం యంత్రాంగాన్ని సిద్ధ చేస్తోందన్నా రు. ప్రజ లందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. జేసీ సిరి మాట్లాడుతూ...  జిల్లాలో మెగా డ్రైవ్‌లో భాగంగా 90వేల మందికి వ్యాక్సిన వేయాలని లక్ష్యం గా  నిర్ణయించామన్నారు. ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు తప్పక వ్యాక్సిన ఇ వ్వాలని ఆదేశాలిచ్చామన్నారు. వ్యాక్సినపై సచివాలయ సిబ్బంది ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. మేయర్‌ వసీం మా ట్లాడు తూ...  చిన్న పిల్లల తల్లులకు ప్రత్యేక వ్యాక్సినే షన చేపట్టడం గొప్ప విష యమన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ శాంతిసుధ, సిబ్బంది పాల్గొన్నారు. 

అనంతపురంరూరల్‌: మండలంలో నిర్వహించిన మెగా వ్యాక్సినేషన ప్రత్యేక డ్రైవ్‌లో 1474మందికి వ్యాక్సినేషన వేసినట్లు కురుగుంట  పీహెచసీ వైద్యాధికారి దివ్య పేర్కొన్నారు. మండలంలో ఆదివారం మెగా వ్యాక్సినేషన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో 45 ఏళ్ల పైబడిన 581మందికి, 18ఏళ్లు పైబడిన 893మందికి వ్యాక్సిన వేసినట్లు ఆమె తెలిపారు. మెగా డ్రైవ్‌లో మండలానికి 1300లక్ష్యంగా కాగా..1474మంది వ్యాక్సిన వేశామన్నారు.

బుక్కరాయసముద్రం : మండలంలో ఆదివారం చేపట్టిన మెగావ్యాక్సిన డ్రైవ్‌ కార్యక్రమాన్ని శింగనమల నియోజకవర్గ ప్రత్యేకాధికారి, డీఆర్‌డీఏ పీడీ న రసింహారెడ్డి, జడ్పీ సీఈఓ శ్రీనివాసులు పరిశీలించా రు. మండల కేంద్రంలోని సచివాలయంలో చేపట్టిన వ్యాక్సినేషన కార్యక్రమాన్ని పరిశీలించిన పీడీ నరసిం హారెడ్డి మాట్లాడుతూ... నియోజకవర్గ వ్యాప్తం గా అన్ని గ్రామ సచివాలయాల్లో ఐదేళ్ల వసుస్సులోపు పిల్లల తల్లులకు వ్యాక్సిన వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ మహబూబ్‌ బాషా, ఎంపీడీఓ తేజోష్ణ, వైద్యాధికారి దయాకర్‌, ఈఓఆర్డీ దామోద రమ్మ, సర్పంచ పార్వతి, పంచాయతీ కార్యదర్శి ముత్యాలరెడ్డి, వీఆర్వో గోపాల్‌రెడ్డి, వలంటీర్లు, ఆశా వర్కర్లు, హెల్త్‌ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

రాప్తాడు: మండలంలోని ఐదేళ్ల లోపు చిన్నారుల తల్లులు, 45 సంవత్సరాలు పూర్తయిన వారు  తప్పనిసరిగా కరోనా టీకా వేయించుకోవాలని వై ద్యాధికారి ఉమాబాయి తెలిపారు. మండలంలోని అన్ని గ్రామా ల్లో ఆదివారం మొత్తం 1000 మందికి టీకా వేశామన్నారు. టీకా కరోనా సోకకుండా నియంత్రిస్తుందన్నారు. రాప్తాడు, గాండ్లపర్తి గ్రామ సచివాలయాల్లో  కార్యక్రమాన్ని ఎంపీడీఓ సాల్మనరాజ్‌, ఇనచార్జ్‌ తహసీల్దార్‌ వరప్రసాదరావు, సర్పంచ తిరుపాలు, వైద్య, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. 

గార్లదిన్నె : మండలంలో 0 నుంచి 5 సంవత్సరాల లోపు వయస్సున్న పిల్ల ల తల్లులందరూ తప్పని సరిగా కొవిడ్‌ వ్యాక్సిన వేయించుకోవాలని తహసీ ల్దార్‌ భరతకుమార్‌ పేర్కొన్నారు. మండలంలోని సచివాల యాల్లో ఆది వారం స్పెషల్‌ డ్రైవ్‌ వ్యాక్సిననేషన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని తహసీల్దార్‌ భరతకుమార్‌, ఎంపీడీఓ వెంకటాచలపతి, వైద్యాధికారి షమీం తాజ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కరోనా మూడో దశ నుంచి రక్షణ పొందేందుకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన వేయించుకో వాలని సూచించారు. మండల వ్యాప్తంగా 650 మంది పిల్లల తల్లులకు, 45 సంవత్స రాలు పైబడిన 425 మం దికి, రెండో డోస్‌ తొమ్మిది మందికి కలిపి మొత్తం 1084 మందికి వ్యాక్సిన వేశామన్నారు. కార్యక్రమంలో పీహెచఎనఎం నాగమ్మ, సూపర్‌వైజర్లు రవీంద్ర, సూ ర్యకళ, హెల్త్‌ అసిస్టెంట్లు ధనుంజయ, శివానంద, వెం కటసుబ్బయ్య తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 

శింగనమల: మండలంలో కరోనా వ్యాక్సినేషన కేం ద్రాల వద్ద నిబంధనలు తప్పక పాటించాలని తహసీ ల్దార్‌ విశ్వనాథ్‌ పేర్కొన్నారు. మండలంలోని అన్ని గ్రా మ సచివాలయాల్లో ఆదివారం నిర్వహించిన కరోనా టీకా స్పెషల్‌ డ్రైవ్‌ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. . ప్రతిఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ వ్యాక్సిన వేయించుకోవాలన్నారు. పుట్టిన పాప నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లల తల్లులు, 45 సంవత్సరాలు పైబడిన వారు వ్యాక్సిన వేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఉమాదేవి, డాక్టర్‌ అన్వర్‌ బాషా పాల్గొన్నారు. అలాగే మండలంలోని అన్ని గ్రామ సచివాలయాల్లో ఆదివారం చేపట్టిన కరోనా టీకా స్పెషల్‌ డ్రైవ్‌ ప్రక్రి యను డీఆర్‌డీఏ పీడీ నరసింహారెడ్డి పరిశీలించారు. వ్యాక్సిన కోసం వచ్చే ప్రతిఒక్కరికి సక్రమంగా వ్యాక్సి వేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. 

చెన్నేకొత్తపల్లి: మండలంలో ఆదివారం కరోనా వ్యా క్సినేషన స్పెషల్‌ డ్రైవ్‌ విజయవంతమైందని ఎంపీడీఓ లోకేశబాబు, తహసీల్దార్‌ నాగేంద్ర తెలిపా రు. మొ త్తం 13 గ్రామ సచివాలయాల పరిధిలో టీకా కార్యక్ర మాన్ని చేప ట్టామన్నారు.  ఐదేళ్లలోపు వయస్సు పిల్లల తల్లులకు మొదటి ప్రా ధాన్యమి చ్చామని, తరువాత 45ఏళ్లు పైబడిన వారికి టీకా వేశామన్నారు. మొత్తం 1000 మందికి టీకాలు వేసి టార్గెట్‌ పూర్తి చేశామన్నారు. కార్యక్రమంలో ఏ ఎనఎంలు, ఆశాకార్య కర్తలు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.

కనగానపల్లి: మండలంలోని సచివాలయాల్లో ఆదివారం మెగా వ్యాక్సినేషన కార్యక్ర మాన్ని వైద్యాధికారులు నిర్వహించారు. ఐదు సంవత్సరాల్లోను బిడ్డల తల్లులతో పాటు 45సంవత్స రాల పైబడిన వారికి కొవిడ్‌ టీకా వేసినట్లు వైద్యాధికారి స్వాతి తెలిపారు. మండలవ్యాప్తంగా 500మందికి వ్యాక్సిన వేసి నట్లు తెలిపారు. వ్యాక్సినేషన కార్యక్రమాన్ని ప్రత్యేకాధి కారి వర ప్రసాద్‌తో పాటు తహసీల్దార్‌ అనూరాధ, ఎంపీడీఓ మమతాదేవి పర్యవేక్షించారు. 


Updated Date - 2021-06-21T05:50:05+05:30 IST