‘ఉపాధి’ నిధులు దోచుకుంటున్న వైసీపీ నేతలు

ABN , First Publish Date - 2021-08-21T06:07:53+05:30 IST

కేంద్రం పేదల కు మంజూరు చేస్తున్న ఉపాధి హామీ నిధులను రాష్ట్రంలో వైసీపీ నేతలు దోచుకుని, జేబులు నింపుకుంటున్నారని ఉపాధి హామీ మండలి రాష్ట్ర మాజీ సభ్యుడు వీరంకి వెంకటగురుమూర్తి ఆరోపించారు.

‘ఉపాధి’ నిధులు దోచుకుంటున్న వైసీపీ నేతలు

ఉపాధి హామీ మండలి రాష్ట్ర మాజీ సభ్యుడు వెంకటగురుమూర్తి

అనంతపురం వైద్యం, ఆగస్టు 20: కేంద్రం పేదల కు మంజూరు చేస్తున్న ఉపాధి హామీ నిధులను రాష్ట్రంలో వైసీపీ నేతలు దోచుకుని, జేబులు నింపుకుంటున్నారని ఉపాధి హామీ మండలి రాష్ట్ర మాజీ సభ్యుడు వీరంకి వెంకటగురుమూర్తి ఆరోపించారు. శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2019 ఆగస్టులో కేంద్రం రూ.1845 కోట్లు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.615 కోట్లు కలిపి మొత్తం రూ.2460 కోట్లు పనులు చేసిన వారికి చెల్లించాలన్నారు. ఆ డబ్బు చెల్లించకుండా నవరత్నాల ముసుగులో పక్కకు మళ్లించారన్నారు. రాష్ట్రంలో పు లివెందుల, పుంగనూరుకు మాత్రం బిల్లులు చెల్లించి, ఇతర జిల్లాలకు మొండిచేయి చూపి, ఉపాధి పథకం చట్టానికి తూట్లు పొడిచారన్నారు. రెండేళ్లు న్యాయపోరాటం చేయగా.. రూ.5 లక్షలలోపు బి ల్లులు చెల్లించాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. ప్రభుత్వం కూడా రూ.413 కోట్లు పనులు చేసిన వారికి జమ చేశామని హైకోర్టుకు తెలిపిందన్నారు. అనేక జిల్లాలో బిల్లులు చెల్లించకుండా అన్యా యం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉపాధి హామీ అక్రమాలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నామనీ, ప్రత్యేక బృందంతో త్వరలో విచారణ చేపట్టే అవకాశం ఉందన్నారు. సమావేశంలో ఉపాధి హామీ కమిటీ మాజీ సభ్యుడు నారాయణస్వామి, కర్నూలుకు చెందిన రామకృష్ణుడు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-21T06:07:53+05:30 IST