రాజకీయదురుద్దేశంతో అనాలోచిత నిర్ణయాలు

ABN , First Publish Date - 2021-12-30T05:50:54+05:30 IST

రాజకీయదురుద్దేశ్యం అనాలోచి తంగా తీసుకున్న నిర్ణయాల వల్ల రిజర్వాయర్ల రద్దుచేయడం రాప్తా డు ప్రజల పాలిట శాపంగా మారిందని మాజీమంత్రి పరిటాల సునీత విమ ర్శించారు.

రాజకీయదురుద్దేశంతో అనాలోచిత నిర్ణయాలు
వేపకుంట గౌరవసభలో మాట్లాడుతున్న పరిటాలసునీత


- రిజర్వాయర్ల రద్దు రాప్తాడు ప్రజలకు శాపం

- జీడిపల్లి నుంచి పేరూరుకు నీరు వచ్చి ఉంటే... 

  లక్షల ఎకరాలు సాగయ్యేది

: మాజీ మంత్రి పరిటాల సునీత 

కనగానపల్లి, డిసెంబరు29: రాజకీయదురుద్దేశ్యం అనాలోచి తంగా తీసుకున్న నిర్ణయాల వల్ల రిజర్వాయర్ల రద్దుచేయడం రాప్తా డు ప్రజల పాలిట శాపంగా మారిందని మాజీమంత్రి పరిటాల సునీత విమ ర్శించారు. ఆమె బుధవారం కొండపల్లి, భానుకోట, వేపకుంట గ్రామాల్లో నిర్వహించిన గౌరవసభల్లో పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో పెద్దఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా సమావేశానికి హాజరైన  ప్రజల నుంచి స మస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలు గుదేశం పార్టీ హయాంలోనే 75శాతం పేరూరు ప్రాజెక్టు పనులు, కాలువ పనులు పూర్తియ్యాయన్నారు. మరోసారి అధికారంలోకి వచ్చిం టే మూడు రిజర్వాయర్ల ఏర్పాటుతో పాటు లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందేవన్నారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి రాజకీయదు రుద్దేశ్యంతోనే పుట్టక నుమ రిజర్వాయర్‌తో పాటు పేరూరు ప్రాజెక్టు కా లువ పనులు రద్దు చేశారన్నారు. జీడిపల్లి నుంచి పేరూరు ప్రాజెక్టుకు కాలువ పనులు పూర్తిచేసి పుట్టకనుమ, సోమరవాండ్లపల్లి రిజర్వా యర్లు పూర్తిచేసి ఉంటే రాప్తాడు నియోజకవర్గవ్యాప్తంగా సస్యశ్యా మలం అయ్యేదన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల డిజైనలు మార్చేసి కాలువ పనులకు భూము లిచ్చిన రైతులకు పరి హారం అందకుండా చేశారన్నారు. టీడీపీ హయాంలో కియాప రిశ్రమ రావడం వల్ల జిల్లాలో కొంతమేర నిరుద్యోగ సమస్య తీరింద న్నారు. ఎమ్మెల్యేకు రైతులపట్ల, నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి లేదు కనుకే, సీఎం జగన వద్దకు వెళ్లి నిధులు తెచ్చే సత్తా లేదన్నా రు. ఇప్ప టికే ఎమ్మెల్యే సోదరుల బెదిరింపులతో రాప్తాడులో నిర్మించే జాకీ పరిశ్రమ వెనక్కు పోయిందన్నారు. ప్రజల సమస్యలు మరిచిన ఎమ్మెల్యే సోదరులు రియల్‌ఎస్టేట్‌ వ్యాపారంతో సామాన్యులను బెదిరించి డబ్బులు వ సూళ్లు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. నియోజకవర్గ వ్యాప్తం గా భూములు కొనాలన్నా, అమ్మాలన్నా వీరికి ఎక్కడ కప్పం కట్టాలోన ని ప్రతిఒక్కరూ భయపడుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితులు మారా లంటే సామాన్యప్రజలు ప్రశాంతంగా బతకాలంటే తిరిగి టీడీపీలోకి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.  ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నెట్టెం వెంకటేష్‌, సుధాకర్‌ చౌదరి, బాలాంజనేయులు, ప్రభాకర్‌నాయుడు, కుళ్లాయప్ప, యువ రాజు, రాజయ్య, ఉమాపతి, స ర్దానీ, నారాయణ, నరసింహులు, గోవిం దు, ఎంపీటీసీ బిల్లేభాస్కర్‌, సర్పంచలు సోమర చంద్రశేఖర్‌, రామాం జనేయులు, రాజాకృష్ణ, మాధవరాజు తదితరులు పాల్గొన్నారు. 

నేటి గౌరవ సభలు 

రాప్తాడు, డిసెంబరు 29: మండలంలోని హంపాపురం, బొమ్మేపర్తి, పుల్లలరేవు గ్రామాల్లో గురువారం నిర్వహించే గౌరవసభ- ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి మాజీ మంత్రి పరిటాల సునీత ముఖ్య అతిఽథిగా హాజరవుతారని టీడీపీ మండల కన్వీనర్‌ నారాయణస్వామి, హంపాపురం మాజీ సర్పంచ గోపాల్‌ తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంటకు హం పాపురం, 3 గంటలకు బొమ్మేపర్తి, 5 గంటలకు పుల్లలరేవు గ్రామాల్లో మాజీ మంత్రి గౌరవ సభల్లో పాల్గొంటారన్నారు. టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పత్రికా ప్రకటనలో కోరారు. 


Updated Date - 2021-12-30T05:50:54+05:30 IST