చేనేత పరిశ్రమపై చిన్నచూపు

ABN , First Publish Date - 2021-12-09T06:01:57+05:30 IST

చేనేత పరిశ్రమపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని ఏపీ చేనేత కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలా రామాంజినేయులు మండిపడ్డారు.

చేనేత పరిశ్రమపై చిన్నచూపు

రిజర్వేషన్‌ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

 ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

ధర్మవరం, డిసెంబరు 8: చేనేత పరిశ్రమపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని ఏపీ చేనేత కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలా రామాంజినేయులు మండిపడ్డారు. చేనేతల సమస్యలను పరిష్కారం కోసం ఏపీచేనేత కార్మికసంఘం ఆధ్వర్యం లో బుధవారం స్థానిక ఆర్టీఓ కార్యాలయం ఎదుట కార్మికులతో కలి సి ఆయన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ...కరోనాతో రెండేళ్లుగా చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ఇప్పుడిప్పుడే కోరుకుంటున్న తరుణంలో  ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మగ్గాలన్నీ నీటమునిగి చేనేత కార్మికులు  ఉపాధికోల్పోయారన్నారు. రెవెన్యూ, హ్యాండ్‌లూమ్‌ అధికారులు నీటమునిగిన మగ్గాలను పరిశీలించారే కానీ ఇంతవరకు  పరిహారం అందించలేదన్నారు. వర్షాలతో నష్టపోయిన వారికి వెంటనే రూ.50 వేలు, నిత్యావసరసరుకులు అందించాలని డిమాండ్‌ చేశారు. అలాగే చేనేతలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు పరిష్కరించాలని కోరా రు. ఈ కార్యక్రమంలో  సీసీఎం పట్టణ కార్యదర్శి జంగాలపల్లి పె ద్దన్న, జి ల్లాకమిటీసభ్యులు ఎస్‌హెచ్‌బాషా, చేనేత నాయకులు పో లా లక్ష్మీనారాయణ, అన్నం సూరి, చెన్నప్రకాశ్‌, బాలాజీ, బండారు భాస్కర్‌, సత్యనారాయణ, అశ్వర్థనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2021-12-09T06:01:57+05:30 IST