వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2021-01-20T06:11:37+05:30 IST

మండలంలోని వన్నేదొడ్డి గ్రామ సమీపాన జాతీయ రహదారిపై మంగళవారం కారు, బైక్‌ ఢీకొనటంతో యువకుడు శివాజీ (22) మృతి చెందాడు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

గుత్తి రూరల్‌, జనవరి 19: మండలంలోని వన్నేదొడ్డి గ్రామ సమీపాన జాతీయ రహదారిపై మంగళవారం కారు, బైక్‌ ఢీకొనటంతో యువకుడు శివాజీ (22) మృతి చెందాడు. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం సీఆర్‌ పల్లికి చెందిన బాలగంగాధర్‌, శివాజీ ద్విచక్రవాహనంలో గుత్తికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్రవాహనదారులు గాయపడగా గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలో శివాజీ మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు.. 

డీ హీరేహాళ్‌: మండలంలోని బళ్లారి-బెంగళూరు జాతీయ రహదారి మడేనహళ్లి గేటు సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదంలో బళ్లారికి చెందిన యువకుడు ఓబులేసు (26) మృతి చెందాడు. ఎస్‌ఐ వలీబాషా తెలిపిన వివరాలివి. ఓబులేసు ద్విచక్రవాహనంలో బళ్లారి నుంచి కర్ణాటకలోని బొమ్మదేవరపల్లికి వెళుతున్నాడు. మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సునీత, ఇద్దరు పిల్లలున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


కిష్టిపాడు వద్ద నలుగురికి గాయాలు

పెద్దవడుగూరు: మండలంలోని కిష్టిపాడు సమీపాన జాతీయ రహదారి విద్యుత సబ్‌స్టేషన వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాలివి. యాడికి మం డలం రాయలచెరువు గ్రామానికి చెందిన కుటుంబ స భ్యులైన నాగరాజు, లలిత, నాగేంద్ర, నాగచైతన్య ద్విచక్రవాహనంలో మండలంలోని అప్పేచర్ల గ్రామానికి వె ళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరి ద్విచక్రవాహనాన్ని సబ్‌స్టేషన వద్ద కారు ఢీకొంది. అదే సమయంలో గుత్తి నుంచి తాడిపత్రికి వస్తున్న బస్సుకు తగలడంతో నలుగురు ద్విచక్రవాహనదారులు గాయపడగా, గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో నాగరాజు, నాగేంద్ర, నాగచైతన్య ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-01-20T06:11:37+05:30 IST