రెండు ద్విచక్ర వాహనాలు, ఆటో స్వాధీనం
ABN , First Publish Date - 2021-10-28T06:11:02+05:30 IST
పట్టణంలోని ముగ్గురు నిందితుల నుం చి రూ.5 లక్షల విలువ చే సే రెండు ద్విచక్ర వాహనా లు, ఆటోను టూటౌన పో లీసులు స్వాధీనం చేసుకున్నారు.

గుంతకల్లుటౌన, అక్టోబరు 27: పట్టణంలోని ముగ్గురు నిందితుల నుం చి రూ.5 లక్షల విలువ చే సే రెండు ద్విచక్ర వాహనా లు, ఆటోను టూటౌన పో లీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం స్థానిక టూటౌన పోలీసు స్టేషనలో డీఎస్పీ నరసింగప్ప వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన గరుడంపల్లి వెంకటసాయి మారుతి, బండారు అనిల్, కల్లూరు నరసింహులు బైకు దొంగతనాలకు పాల్పడుతున్నారు. మోదినాబాద్ వద్ద టూటౌన సీఐ చిన్న గోవిందు, ప్రత్యేక టీం సభ్యులు తనిఖీ చేస్తుండగా వారు ద్విచక్ర వాహనం, ఆటోలో వస్తూ ఎదురుపడ్డారు. పోలీసులను చూసి పారిపోతుండగా అదుపులోకి తీసుకుని, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల పై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచామన్నారు. సమావేశంలో ఎస్‌ఐ సురే్‌షబా బు, ఏఎ్‌సఐ తిరుపాల్ పాల్గొన్నారు.