నమ్మండి... ఇవీ జగనన్న కాలనీలు!
ABN , First Publish Date - 2021-10-25T05:36:28+05:30 IST
కోట్లు గుమ్మరించి ప్రకటనలు... లక్షలు వెచ్చించి సంబరాలు... వేలాధిగా తరలించి ఆర్భాటాలు... ఇవన్నీ జగనన్న కాలనీలకు ప్రభుత్వం చేసిన హంగామా.

హిందూపురం టౌన, అక్టోబరు 24: కోట్లు గుమ్మరించి ప్రకటనలు... లక్షలు వెచ్చించి సంబరాలు... వేలాధిగా తరలించి ఆర్భాటాలు... ఇవన్నీ జగనన్న కాలనీలకు ప్రభుత్వం చేసిన హంగామా. అయితే అప్పడంటే వర్షాలు రాలేదు కాబట్టి కొందరు లబ్ధిదారులు పునాలుదు వేసుకున్నారు. అయితే ఓ మోస్తరు వర్షం కురిసేసరికి జగనన్న కాలనీల అసలు సమస్యలు బయటపడుతున్నాయి. హిందూపురం ప్రాంతంలో కురిసిన వర్షాలకు జగనన్న కాలనీలు జలమయమయ్యాయి. అధికారులకు ముందు చూపు లేకపోవడంతో వారు ఇష్టం వచ్చిన చోట లబ్ధిదారులకు స్థలాలు చూపించారు. ఈ పరిస్థితుల్లో శనివారం రాత్రి కురిసిన వర్షానికి పూలకుంట వద్ద ఉన్న జగనన్న కాలనీలోకి నీరు చేరాయి. ఇప్పటికే కొంతమంది పునాదులు నిర్మించుకున్నారు. దీంతో వర్షం భారీగా కురవడంతో పునాదులన్నీ నీటిలో మునిగిపోయాయి. మౌలిక సదుపాయాలు కల్పిస్తామంటూ ప్రభుత్వం చెప్పిన హామీలన్నీ ఏమైనట్లోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.