ట్రిపుల్‌ ఐటీ ‘టాప్‌’లేపారు..!

ABN , First Publish Date - 2021-10-07T06:50:44+05:30 IST

ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షలో జిల్లా విద్యార్థులు టాప్‌ 10లోపు ర్యాంకుల్లో రెండు ర్యాంకులను కైవసం చేసుకున్నారు.

ట్రిపుల్‌ ఐటీ ‘టాప్‌’లేపారు..!
గుణశేఖర్‌కు స్వీట్లు తినిపిస్తున్న తల్లిదండ్రులు

 ప్రథమ,  9వ ర్యాంకులు సాధించిన గుణశేఖర్‌, వంశీకృష్ణ

అనంతపురం అర్బన, అక్టోబరు 6ః ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షలో జిల్లా విద్యార్థులు టాప్‌ 10లోపు ర్యాంకుల్లో రెండు ర్యాంకులను కైవసం చేసుకున్నారు. బుధవారం వెల్లడించిన ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ధర్మవరం పట్టణానికి చెందిన మద్దన గుణశేఖర్‌ రాష్ట్ర స్థాయి ప్రథమ ర్యాంకును సాధించాడు. మున్సిపల్‌ హైస్కూల్‌లో చదివిన గుణశేఖర్‌ పదవ తరగతిలో పదికి పది పాయింట్ల సాధించాడు. తల్లిదండ్రులు లక్ష్మీదేవి, రామకృష్ణ జరీ వ్యాపారం చేస్తున్నారు. అలాగే గుంతకల్లు పట్టణానికి చెందిన చిప్పగిరి వంశీకృష్ణ రాష్ట్రస్థాయి 9వ ర్యాంకును సాధించాడు. ఇతడి తల్లిదండ్రులు కవిత, ప్రభాకర్‌ మగ్గం నేస్తున్నారు. గుంతకల్లు రాజేంద్ర మున్సిపల్‌ హైస్కూల్‌లో చదివిన వంశీకృష్ణ పదవ తరగతిలో పది పాయింట్లు సాధించాడు.  కాగా.. జిల్లాలో 1579 మంది విద్యార్థులు 20 వేలలోపు ర్యాంకులు సాధించారు. వీరిలో వెయ్యిలోపు 72 మంది, 5 వేలోపు 304.., 10వేలలోపు 383.., 20 వేలలోపు 820మంది ర్యాంకులు కైవసం చేసుకున్నారు.Updated Date - 2021-10-07T06:50:44+05:30 IST