ఘనంగా తిరుప్పావై నోము

ABN , First Publish Date - 2021-01-12T06:29:49+05:30 IST

ప ట్టణంలోని చింతల వెంకటరమణస్వామి ఆలయంలో సోమవారం తి రుప్పావై నోము వేడుకలు ఘనంగా జరిగాయి.

ఘనంగా తిరుప్పావై నోము
గోదాదేవి అమ్మవారు

తాడిపత్రి టౌన, జనవరి 11: ప ట్టణంలోని చింతల వెంకటరమణస్వామి ఆలయంలో సోమవారం తి రుప్పావై నోము వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గోదాదే వి అమ్మవారికి ప్రత్యేక పూజలు ని ర్వహించారు. అనంతరం ప్రాకారోత్స వ పూజలు కొనసాగాయి.  చిన్నారు ల కోలాట నృత్యం అందరిని ఆకట్టుకుంది. భక్తులు తరలివచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.


వెంకటేశ్వరస్వామి ఆలయంలో కూడరై ఉత్సవం

గుంతకల్లు టౌన, జనవరి 11: పట్టణంలోని రాజేంద్రనగర్‌ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సో మవారం కూడరై ఉత్సవాన్ని నిర్వహించారు. ఆల య ఆవరణలో వెంకటేశ్వరస్వామి, శ్రీదేవి, భూదే వి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి కొ లువుదీర్చారు. గోదాదేవికి పాలతో చేసిన పాయసాన్ని నైవేధ్యంగా ఉంచి పూజలు చేశారు. 


వైభవంగా కోదండరాముడి ఊరేగింపు

తాడిపత్రి, జనవరి 11: పట్టణంలో సోమవా రం రాత్రి కోదండరామస్వామి ఊరేగింపు వైభవం గా జరిగింది. రెడ్డివారిపాలెంలోని స్వామి ఆలయంలో జరుగుతున్న ధనుర్మాస పూజలను పురస్కరించుకొని ఉత్సవమూర్తిని ఊరేగించారు. దేవాలయం నుంచి ప్రారంభమైన ఊరేగింపు రెడ్డివారిపాలెం, పుట్లూరురోడ్డు, సీబీరోడ్డుల మీదుగా కొనసాగింది. ఊరేగింపులో స్వామివారిని భక్తులు ద ర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమం లో మాజీ వీఆర్వో రాజగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. 


రథం నిర్మాణానికి విరాళాలు

ఉరవకొండ, జనవరి 11: మండలంలోని పెన్నహోబిలం లక్ష్మీనరసిం హ స్వామి ఆలయ నూతన రథం నిర్మాణానికి రూ.91,606 విరాళాలు అం దినట్లు ఈఓ రమేష్‌ బాబు సోమవారం తెలిపారు. అనంతపురం గోపీ కృష్ణ, శివకృష్ణ కుటుంబసభ్యులు రూ.56 వేలు, హొస్పేట్‌ దేవరమని కు టుంబ సభ్యులు రూ.25,100, ఉరవకొండ సురే్‌షబాబు రూ.5,506, మ హేష్‌ రూ.5 వేలు అందజేశారన్నారు. రూ.1.50 కోటితో రథాన్ని తయారు చేయిస్తున్నట్లు ఈఓ తెలిపారు. ఇప్పటి వరకు రూ.47,31,216 విరాళాలు అందాయన్నారు. ఆలయ కమిటీ సభ్యుడు ఈడిగ బాబు పాల్గొన్నారు.



Updated Date - 2021-01-12T06:29:49+05:30 IST