సుద్దులు చెప్పేవారే.. శుభ్రం పాటించరా.?

ABN , First Publish Date - 2021-07-12T05:55:24+05:30 IST

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్య ఆరోగ్య సిబ్బంది నిత్యం గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉంటారు. అయితే మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మాత్రం పిచ్చిమొక్కలు పెరిగిపోయినా వాటి గురించి మాత్రం పట్టించుకోవడం లేదు.

సుద్దులు చెప్పేవారే.. శుభ్రం పాటించరా.?
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు


ఆసుపత్రి ఆవరణలో ఏపుగా పిచ్చిమొక్కలు

పట్టించుకోని వైద్యాధికారులు


గాండ్లపెంట, జూలై 11 : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్య ఆరోగ్య సిబ్బంది నిత్యం గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉంటారు. అయితే మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మాత్రం పిచ్చిమొక్కలు పెరిగిపోయినా వాటి గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. నిత్యం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వైద్యులు, వైద్య సిబ్బంది ఏపుగా పిచ్చిమొక్కలు పెరిగినప్పటికీ చూసి చూడనట్లు వ్యవహరించడం శోచనీయం. వర్షాకాలం కావడంతో పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగిపోయి అపరిశుభ్రతతో దోమ లు వ్యాప్తి చెందుతున్నాయి. ఆసుపత్రి ఆవరణ ఇలా అపరిశుభ్రంగా ఉంటే గ్రామాల్లో పరి శుభ్రత పాటించాలని వైద్యులు, వైద్య సిబ్బంది సూచనలివ్వడం ఏమిటని ఆసుపత్రికి వచ్చే రోగులు చర్చించుకుంటున్నారు. ఆసుపత్రి ముందు గుంతలు ఏర్పడి వర్షపునీరు నిల్వ ఉం డటంతో దోమలు అధికమవుతున్నాయని అక్కడ నివాసం ఉంటున్న కాలనీ వాసులు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో పిచ్చిమొక్కలు తొల గించి, ఆసుపత్రి ఎదుట వర్షపునీరు నిల్వ ఉండకుండా చూడాలని స్థానిక ప్రజలు, ఆసుప త్రికి వచ్చే రోగులు కోరుతున్నారు. 


Updated Date - 2021-07-12T05:55:24+05:30 IST