‘ఇలాగైతే మేం పనిచేయలేం’

ABN , First Publish Date - 2021-12-28T05:44:41+05:30 IST

అధికారులే టార్గెట్‌ చేస్తూ కౌన్సిలర్లు దాడి చేయడం సరికాదని మునిసిపల్‌ ఉద్యోగులు అన్నారు.

‘ఇలాగైతే మేం పనిచేయలేం’
మున్సిపల్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదుట ఉద్యోగుల నిరసన

హిందూపురం టౌన, డిసెంబరు 27: అధికారులే టార్గెట్‌ చేస్తూ కౌన్సిలర్లు దాడి చేయడం సరికాదని మునిసిపల్‌ ఉద్యోగులు అన్నారు. సోమవారం కౌన్సిల్‌హాల్‌లో కమిషనర్‌పై అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు దురుసుగా ప్రవర్తించడం, వ్యక్తిగతంగా దూషించడంపై కార్యాలయం వెలువల నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మునిసిపల్‌ ఉద్యోగులు మాట్లాడుతూ ‘మీ వ్యక్తిగత పనుల కోసం మమ్మల్ని ఇష్టానుసారంగా విమర్శించడం సరికాదు. ఇలాగే వ్యవహరిస్తే మూకుమ్మడిగా సెలవుపై వెళ్తాం...’ అంటూ తెగేసి చెప్పారు. మున్సిపల్‌ చట్టం ప్రకారం ఏ అధికారిపైనైనా విమర్శలు చేయాలంటే విమర్శించే అధికారిపై చైర్‌పర్సనకు వినతిపత్రం అందించాలన్నారు. అనంతరం సదరు అధికారిపై మాట్లాడాలన్నారు. కనీసం సభా మర్యాదలు తెలుసుకోకుండా అధికారులపై విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. అందరూ కలిసి ప్రజా సమస్యలు పరిష్కరించాలని హితవుపలికారు. ‘మీ రాజకీయాల్లోకి మమ్మల్ని ఎందుకు లాగుతున్నారని..’ కౌన్సిలర్లను ప్రశ్నించారు. అనంతరం చైర్‌పర్సన ఇంద్రజకు వినతిపత్రం అందించారు. Updated Date - 2021-12-28T05:44:41+05:30 IST