ఐదు దుకాణాల్లో చోరీ

ABN , First Publish Date - 2021-07-08T06:07:18+05:30 IST

మండలకేంద్రంలో మంగళవారం రాత్రి దొంగలు ఐదు దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డారు.

ఐదు దుకాణాల్లో చోరీ

బుక్కపట్నం, జూలై 7: మండలకేంద్రంలో మంగళవారం రాత్రి దొంగలు ఐదు దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు...బుక్కపట్నంలోని గ్రం థాలయం పక్కన బేకరీలో రూ.25వేలు, వైశ్యాబ్యాంక్‌ ఎదురు గా ఉన్న  హోటల్‌ల్లో రూ.5వేలు విలువ చేసే సామగ్రి, ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోఉన్న చిట్టు హోటల్‌లో రూ.5వేలు విలువ చేసే వస్తువులు, మరో రెండు చిల్లర దుకాణాల్లో దాదాపు రూ.5వేలు విలువ చేసే సిగిరెట్లు, బీడీలు చోరీకి గురైనట్టు బాధితులు తెలిపారు. అలాగే తేరుకూడలిలోని మందుల దుకా ణంలో కూడా చోరీ చేయడానికి ప్ర యత్నించారు.  బాదితుల ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-07-08T06:07:18+05:30 IST