చెరువులో పడి యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-12-09T06:05:29+05:30 IST

చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవ శాత్తు కాలుజారి చెరువులో పడి చంద్రాచారి(28) అనే యువకుడు బుధవారం మృతి చెందాడు.

చెరువులో పడి యువకుడి మృతి

బుక్కరాయసముద్రం, డిసెంబరు8 : చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవ శాత్తు కాలుజారి చెరువులో పడి చంద్రాచారి(28) అనే యువకుడు బుధవారం మృతి చెందాడు. ఎస్‌ఐ రాంబాబు తెలిపిన మేరకు... అనంతపురం నగరానికి చెం దిన చంద్రాచారి వ్యవసాయ కూలీగా పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు. అతడు బుధవారం చేపలు పట్టేందుకు అనంతపురం పాతూరు చెరువు వద్దకు వె ళ్లాడు. అయితే చెరువుకట్టపై నుంచి కాలుజారి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. మృతుడికి తల్లి, తండ్రి, బంధువులు ఎవరూ లేరని పోలీసులు తెలిపారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-12-09T06:05:29+05:30 IST