భర్తను చంపించిన భార్య

ABN , First Publish Date - 2021-08-25T05:36:11+05:30 IST

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను భార్యే చంపించిన కేసును పోలీసులు ఛేదించారు.

భర్తను చంపించిన భార్య
వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు


వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడనే.. 

లేపాక్షి, ఆగస్టు 24: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను భార్యే చంపించిన కేసును పోలీసులు ఛేదించారు. హిం దూపురం రూరల్‌ సీఐ హమీద్‌ఖాన్‌ మంగళవారం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. శిరివరం గ్రామానికి చెందిన నారాయణప్ప (50) ఈనెల 18న అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. దీని పై నారాయణప్ప తమ్ముడు గంగప్ప పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ సద్గురుడు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మృతుడి భార్య గంగాదేవమ్మ, పరిగి గ్రామానికి చెందిన శిరివరం ఆదెప్పతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండేది. విషయం తెలుసుకున్న నారాయణప్ప మందలించాడు. భర్త అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి గంగాదేవమ్మ పన్నాగం పన్నింది. భర్తను చంపాలని పథకం వేసింది. ఈనెల 18న నారాయణప్ప ఇంట్లో నిద్రిస్తుండగా ప్రియుడు, భర్త సోదరి కుమారుడితో కలిసి నారాయణప్పను తలదిండుతో ఊపిరాడకుండా చేసి, హత్య చేశారు. మృతదేహాన్ని రెండు రోజులు ఇంట్లోనే ఉంచుకోగా గంగప్పకు అనుమానం వచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదుచేసి, మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దర్యాప్తులో హత్య చేసినట్ల నిర్ధారించుకున్నారు. ఆ మేరకు మంగళవారం చోళసముద్రం బస్టాండు వద్ద నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు. 


Updated Date - 2021-08-25T05:36:11+05:30 IST