రచ్చబండకు చేరిన ‘పింఛన్ల’ కథ

ABN , First Publish Date - 2021-11-02T06:15:28+05:30 IST

‘ఇంటి వద్దకే పింఛ న్ల’ కథ పీర్లచావిడి చేరింది. ప్రభుత్వం వృద్ధులు, వితంతు, దివ్యాంగ పింఛన్లు ఇళ్ల వద్దకే వెళ్లి ఇవ్వాలని సంక ల్పించినా... వలంటీర్లు తూ ట్లుపొడుస్తున్నారు.

రచ్చబండకు చేరిన ‘పింఛన్ల’ కథ
పీర్లచావిడి వద్ద పింఛన ఇస్తున్న గ్రామ వలంటీర్‌

పెద్దవడుగూరు, నవంబరు 1: ‘ఇంటి వద్దకే పింఛ న్ల’ కథ పీర్లచావిడి చేరింది. ప్రభుత్వం వృద్ధులు, వితంతు, దివ్యాంగ పింఛన్లు ఇళ్ల వద్దకే వెళ్లి ఇవ్వాలని సంక ల్పించినా... వలంటీర్లు తూ ట్లుపొడుస్తున్నారు. మండ లంలోని బుర్రాకుంట గ్రా మంలో సోమవారం ఇదే తంతు సాగింది. లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి స్వయంగా పంపిణీ చేయాల్సిన గ్రామ వలంటీర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామంలోని పీర్లచావిడి వద్ద కూర్చొని లబ్ధిదారులను పిలిపించి పంపిణీ చేయడం కనిపించింది. ఇదే విషయమై పలువురు లబ్ధిదారులు ప్రశ్నిస్తే... ‘మీ ఇంటివద్దకు రాము... నీకు దిక్కున్నచోట చెప్పుకో’ అంటూ వలంటీర్లు బుకాయిస్తున్నారు. వారు చేసేదేమిలేక పింఛన తీసుకొని వెళ్లడం కనిపించింది. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాల్సిన వలంటీర్లు కొందరు అధికారపార్టీ నాయకుల అండదండలు ఉన్నాయన్న ధైర్యంతో ఇలా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.


Updated Date - 2021-11-02T06:15:28+05:30 IST