అదే తీరు.. వ్యాక్సిన కోసం ఎగబడ్డ జనం

ABN , First Publish Date - 2021-05-02T06:18:12+05:30 IST

స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం కరోనా వ్యాక్సిన కోసం ప్రజలు ఎగబడ్డారు. కరోనా సెకెండ్‌వేవ్‌ ఉధృతి ఎక్కువగా ఉండడంతో వ్యాక్సిన కోసం ప్రజలు క్యూకట్టారు.

అదే తీరు.. వ్యాక్సిన కోసం ఎగబడ్డ జనం
తాడిపత్రిలో వ్యాక్సిన వేయించుకొనేందుకు గుంపులుగా ఉన్న దృశ్యం

తాడిపత్రి టౌన, మే 1: స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం కరోనా వ్యాక్సిన కోసం ప్రజలు ఎగబడ్డారు. కరోనా సెకెండ్‌వేవ్‌ ఉధృతి ఎక్కువగా ఉండడంతో వ్యాక్సిన కోసం ప్రజలు క్యూకట్టారు. నిబంధనలు ఏమాత్రం పాటించకుండా గుంపులుగా ఉంటూ వ్యాక్సిన కోసం ఎదురుచూశారు. పే రు నమోదు కోసం ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద కూడా తోపులాట కనిపించింది. నియంత్రించాల్సిన అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం పై విమర్శలు వెల్లువెత్తాయి. శనివారం మొత్తం 802 మందికి వ్యాక్సిన వే శామని అధికారులు తెలిపారు. వ్యాక్సిన అయిపోవడంతో వందల సంఖ్య లో ప్రజలు వెనుదిరిగారు. 


యాడికి: కరోనా వ్యాక్సిన కేంద్రాల వద్ద గుంపులు గుంపులుగా కనిపిస్తున్న జనసందోహాన్ని చూస్తుంటే కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ఇంత ని ర్లక్ష్యమా అనక మానరు. శనివారం యాడికి పంచాయతీ కార్యాలయంలో రెండవ డోసు వ్యాక్సిన వేశారు. వ్యాక్సిన కోసం వచ్చిన ప్రజలు నిరీక్షించడానికి సరైన ఏర్పాట్లు లేకపోవడంతో వ్యాక్సిన నమోదు వద్ద ప్రజలు గుం పులు గుంపులుగా కనిపించారు. కరోనా సెకెండ్‌వేవ్‌లో వైరస్‌ వేగంగా వ్యా పిస్తూ ఎక్కువమంది వైరస్‌ బారిన పడుతుంటే... వ్యాక్సిన కేంద్రాల వద్ద ప్రజలు గుంపులుగా చేరారు. వీరిని నిలువరించి కనీస జాగ్రత్తలు పాటించేలా చేయాల్సిన అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.

Updated Date - 2021-05-02T06:18:12+05:30 IST