రాజధాని వికేంద్రీకరణ బిల్లు రద్దు హర్షణీయం

ABN , First Publish Date - 2021-11-23T06:34:58+05:30 IST

రాష్ట్రంలో మూడు రాజధానుల ని ర్ణయాన్ని వెనక్కితీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో సోమ వారం పట్టణంలో టీడీపీ, వామపక్ష నాయకులు హర్షం వ్యక్తంచేశా రు.

రాజధాని వికేంద్రీకరణ బిల్లు రద్దు హర్షణీయం
కళ్యాణదుర్గం టీసర్కిల్‌లో టీడీపీ, వామపక్షాల సంబరాలు

కళ్యాణదుర్గం, నవంబరు22: రాష్ట్రంలో మూడు రాజధానుల ని ర్ణయాన్ని వెనక్కితీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో సోమ వారం పట్టణంలో టీడీపీ, వామపక్ష నాయకులు హర్షం వ్యక్తంచేశా రు. స్థానిక టీసర్కిల్‌లో బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నా రు. ఈసందర్భంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయచౌదరి మాట్లాడుతూ రాజధాని రైతుల పోరాట ఫలితంతోనే ప్ర భుత్వం దిగివచ్చిందని స్పష్టం చేశారు. రాజధాని వికేంద్రీకణపై వామపక్షాలతో పాటు అన్ని ప్రాంతాల ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తు న్నా సీఎం జగన మూర్ఖత్వంతో ముందుకుపోయారన్నారు. ‘ఒకే రా ష్ట్రం... ఒకే రాజధాని’ నినాదంతో రాజధాని రైతులు 700 రోజుల పాటు దీక్షలు చేపట్టారన్నారు. చివరకు న్యాయస్థానం నుంచి దేవస్థానం వర కు పాదయాత్ర కొనసాగుతున్న క్రమంలో ప్రభుత్వం నిర్ణయాన్ని ఉప సంహరించుకుందన్నారు. ఇప్పటికైనా రాజధాని వికేంద్రీకరణ బిల్లు ర ద్దుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా ఏఐఎ్‌సఎఫ్‌ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. రాజధాని బిల్లు రద్దుపై స్పష్ట త ఇవ్వకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు చౌళం మల్లికార్జున, పాపంపల్లి రామాంజినేయులు, ఆర్జీ శివశంకర్‌, గోళ్ల వెంకటేశులు, మల్లికార్జున, మారుతిచౌదరి, ప్రియాంక, డీకే రామాంజినేయులు, రాజశేఖర్‌చౌదరి, గౌని  శ్రీ నివాసరెడ్డి, ఊటంకి రామాంజినేయులు, గోవిందరెడ్డి, ఒంటిమిద్ది సత్తి, హనుమంతరెడ్డి, కొల్లాపురప్ప, నారాయణ, రంగప్ప, రామన్న, రాయపాటి రామాంజినేయులు, భాస్కర్‌, మంజునాథ్‌రెడ్డి, కుణేసాయినాథ్‌, సీపీఐ, కాంగ్రెస్‌ నాయకులు రాయపాటి అశోక్‌, సంజీవప్ప, గోపాల్‌, అశ్వర్థ ఏఐఎ్‌సఎఫ్‌ హనుమంతు, తిలక్‌, సాయి పాల్గొన్నారు.  


పాదయాత్ర భగ్నానికి కుట్ర : టీడీపీ 

రాయదుర్గం రూరల్‌: రాజధాని రైతుల పాదయాత్రను భగ్నం చే యడానికే ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కితీసుకుం టున్నట్లు ప్రకటించిందని అనంతపురం పార్లమెంటు టీడీపీ అధికార ప్రతినిధి పొరాళ్లు పురుషోత్తమ్‌ పేర్కొన్నారు. సోమవారం స్థానిక పా ర్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సాంకేతిక సమ స్యల బూచి చూపి బిల్లును వెనక్కు తీసుకుంటున్నామని, భవిష్యత్తు లో బిల్లును మెరుగుపరుస్తున్నట్లు అసెంబ్లీలో చెప్పడం విడ్డూరంగా వుందన్నారు. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చి రెండేళ్లు గ డిచినా ఒక్క ఇటుక కూడా పేర్చిన పాపాన పోలేదన్నారు. సీఎం జగ న ఏకపక్ష ప్రజావ్యతిరేక నిర్ణయాలతో రెండున్నరేళ్ల పాలన బోసిపో యిందన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని, రాజధాని రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ససమావేశంలో మాజీ మున్సిపల్‌ చైర్మన నల్లపూల వెంకటేశులు, నాయకులు తిప్పేస్వామి, పొరాళ్లు సురేంద్ర, తిప్పేస్వా మి, కరెన్న, గఫూర్‌, శ్రీరాములు, నవీన పాల్గొన్నారు. 

రాజధాని రైతుల త్యాగ ఫలితమే... : బీజేపీ

రాయదుర్గంటౌన: మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకోవడం పట్ల బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జింకా వ సుంధరా దేవి హర్షం వ్యక్తంచేశారు. యేడాదిన్నరగా అమరావతిలో ఆందోళన చేస్తున్న రైతులకు ఫలితం దక్కిందన్నారు. అమరావతి రైతులు త్యాగాలతో సాధించుకున్న ప్రజా విజయమని పేర్కొన్నారు. కష్టనష్టాలను ఓర్చుకుని ఉద్యమంలో పాల్గొన్న మహిళా రైతుల త్యా గాలు మరువలేనివని పేర్కొన్నారు. 


Updated Date - 2021-11-23T06:34:58+05:30 IST